9 న కాంగ్రెస్ జాబితా.

telanagana congress

న్యూఢిల్లీ:

తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితాపై పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ చర్చించిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు పరిశీలించిన స్థానాల్లో అభ్యర్థుల ఖరారు ఓ కొలిక్కి వచ్చిందని చెప్పారు. అభ్యర్థుల జాబితా మొత్తాన్ని ఒకేసారి విడుదల చేయాలా..? వద్దా? అనే విషయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నిర్ణయిస్తారని ఉత్తమ్‌ వివరించారు.దిల్లీలో కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ముగిసిన అనంతరం ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడారు. అభ్యర్థుల జాబితాను ఈనెల 8 లేదా 9న ప్రకటిస్తామన్నారు. తెదేపాతో 14 సీట్లకు అంగీకారం కుదిరిందని.. తెజస, సీపీఐతో సీట్ల సర్దుబాటుపై చర్చలు కొనసాగుతున్నాయని ఉత్తమ్‌ చెప్పారు. మొత్తం 95 స్థానాల్లో కాంగ్రెస్‌ బరిలో ఉంటుందని, మిగతా 24 స్థానాల్లో మిత్రపక్షాలు పోటీ చేస్తాయన్నారు.
కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ ఈనెల 8న మరోసారి సమావేశమై అభ్యర్థుల జాబితాకు ఆమోదముద్ర వేసే అవకాశముంది. కూటమిలోని పార్టీలతో చర్చలు పూర్తయ్యాకే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ కుంతియా చెప్పారు