జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం. – సీఎస్ ఎస్. కె.జోషి.

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం.
– సీఎస్ ఎస్. కె.జోషి.
TUWJ Diary

హైదరాబాద్:

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషీ అన్నారు. సోమవారం ఆయన సచివాలయంలోని తన చాంబర్లో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే ) 2019 డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీయుడబ్ల్యుజె నాయకులు జర్నలిస్టుల సమస్యలను ఆయన దృష్టిటికి తీసుకెళ్లారు. ముఖ్యంగా మెట్రో రైళ్లలో జర్నలిస్టులకు ఉచిత ప్రయాణ సౌకర్యం గురించి సిఎస్ దృష్టి కి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ విషయంలో చర్చించి తగు చర్యలు చేపడతామన్నారు. అలాగే ప్రైవేట్ , కార్పొరేట్ ఆసుపత్రుల్లో జర్నలిస్టుల హెల్త్ కార్డులు తిరస్కరణకు గురవుతున్న ఘటనలు కూడా ఈ సందర్బంగా ప్రస్తావనకు వచ్చింది. వాటికి సంబంధించిన వివరాలు అందచేస్తే చర్యలు తీసుకుంటామని సిఎస్ జోషీ హామీ ఇచ్చారు. మంచి సమాచారంతో మీడియా డైరీని రూపొందించిన టీయుడబ్ల్యుజెను జోషి అభినందించారు. డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ, ప్రెస్ కౌన్సిల్ సభ్యులు ఎం.ఏ.మాజిద్ , ఐజెయూ కార్యదర్శి వి.నరేందర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు
కె.సత్యనారాయణ, జనం సాక్షి సంపాదకులు ఎం.ఎం.రహ్మాన్, టీయుడబ్ల్యుజె ఉపాధ్యక్షులు దొంతు రమేష్, రాష్ట్ర నాయకులు వి.యాదగిరి, బి.కిరణ్ కుమార్, టి. కోటిరెడ్డి, ఏ.రాజేష్,
హెచ్ యూ జె కార్యదర్శి ఎస్. శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.