వేలాదిగా ఖాతాలు తొలగించిన ట్విట్టర్!!

twitter
న్యూఢిల్లీ:

ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వేలాది ఆటోమేటెడ్ అకౌంట్స్ డిలిట్ చేసింది. మంగళవారం జరగబోయే కీలక మధ్యకాల ఎన్నికలకు దూరంగా ఉండాలని డెమోక్రాట్స్ వి చెప్పుకొనే అకౌంట్స్ నుంచి ట్వీట్స్ వెల్లువెత్తడంతో ట్విట్టర్ ఈ చర్య తీసుకొన్నట్టు తెలిసింది. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ‘మా విధానాలను ఉల్లంఘిస్తూ ఆటోమేటెడ్ సందేశాల ద్వారా తప్పుడు ప్రచారాన్ని వ్యాపింపజేసే ప్రయత్నాలను అడ్డుకొనేందుకు కొన్ని అకౌంట్లను తొలగించినట్టు‘ తెలియజేసింది.సెప్టెంబర్ చివర, అక్టోబర్ ప్రారంభంలోనే తొలగించిన తమ అకౌంట్ల నుంచి ట్వీట్లు వస్తున్నాయని డెమోక్రాటిక్ కాంగ్రెషనల్ క్యాంపెయిన్ కమిటీ ట్విట్టర్ ను అప్రమత్తం చేసింది. ‘ఈ ఏడాది ఎన్నికల కోసం రెండు ప్రధాన పార్టీలకు మేం కొన్ని ఓపెన్ లైన్స్ ఏర్పాటు చేసినట్టు ట్విట్టర్ తెలిపింది. ఎన్నికల అధికారులకు నేరుగా, తేలికగా ఫిర్యాదు చేసేందుకు..డీహెచ్ఎస్, ప్రచార సంస్థలకు ఈ లైన్లు కేటాయించింది. ఈ అకౌంట్ల నెట్ వర్క్ అమెరికాలో మాత్రం ఉండదు. ఎక్కడ నుంచి ఇవి పనిచేస్తాయనేది ట్విట్టర్ తెలియజేయలేదు. కొన్ని నెలలుగా ఆటోమేటెడ్, నకిలీ ఖాతాలను ట్విట్టర్ తొలగిస్తోంది. గత త్రైమాసికంలో తమ యాక్టివ్ యూజర్ల సంఖ్య 90 లక్షల మేర పడిపోయిందని ట్విట్టర్ తెలిపింది.