ఆయుధాల అక్రమ రవాణా. ఇద్దరు అరెస్ట్.

ఆయుధాల అక్రమ రవాణా. ఇద్దరు అరెస్ట్.

null

హైదరాబాద్:

హైదరాబాద్ నగరంలో ఆయుధాలను అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు అంతరాష్ట్ర నేరస్తులను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు తుపాకులను, రెండు రౌండ్ల బుల్లెట్లు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు జాంషీర్ అలియాస్ హస్సాన్ పరారీలో ఉన్నాడు. ఇతడిని పట్టుకునేందుకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేసినట్లు రాచకొండ సిపి తెలిపారు. ఒక్కో తుపాకీని లక్ష రూపాయలకు విక్రయిస్తున్నట్టు తమ విచారణలో తేలిందని సిపి చెప్పారు. బిహార్ నుంచి వీరు తుపాకులను కొనుగోలు చేసి హైదరాబాద్ లో విక్రయిస్తున్నట్టు తెలిసింది.