ఇంకా వుంది’!! వదంతులు నమ్మొద్దు ఫ్లీజ్.

Uttam

‘ఇంకా వుంది’!!
వదంతులు నమ్మొద్దు ఫ్లీజ్.
– ఉత్తమ్

న్యూఢిల్లీ:

కాంగ్రెస్ ఎమ్మెల్యే ల అభ్యర్థుల జాబితా అంశాలపై సంప్రదింపులు, చర్చలు కొనసాగుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అభ్యర్థుల ఖరారుకు సంబంధించిన ప్రచారాన్ని నమ్మరాదని ఆయన విజ్ఞప్తి చేశారు.జాబితా పై ఇంకా తుది నిర్ణయం కాలేదన్నారు.”టీవీ న్యూస్ ఛానల్స్ లో సామాజిక మాధ్యమాల్లో , పత్రికల్లో వస్తున్న జాబితాలు నిజం కాదు. ఇంకా ఎలాంటి జాబితా సిద్ధం కాలేదన్నారు.ప్రచారంలో ఉన్న జాబితాలు నిజం కాదు, అవి ఊహాజనీతం, కల్పితం, నాయకులు, కార్యకర్తలు వాటిని నమ్మవద్దు.
కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా రేపు శుక్రవారం విడుదల చేస్తాం.అధికారికంగా జాబితా విడుదల అయ్యే వరకు ఎలాంటి జాబితాలు నమ్మవద్దు, ఆందోళన చెందవద్దు” అని ఉత్తం చెప్పారు.