వ‌చ్చే దీపావ‌ళి కాంగ్రెస్ ప్ర‌భుత్వంలోనే.. – ఉత్త‌మ్‌

Uttam

వ‌చ్చే ఏడాది దీపావ‌ళి పండుగ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వ పాల‌న‌లోనే జ‌రుగుతుంద‌ని, ప్ర‌జ‌ల జీవితాల‌లో వెలుగు నింపేందుకు కాంగ్రెస్ అద్బుత‌మైన ప్ర‌ణాళిక‌తో పాలన చేస్తుంద‌ని టిపిసిసి అధ్య‌క్షులు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్ర‌జ‌ల‌కు దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలిపారు. 60 ఏళ్ళ పాటు తెలంగాణ ఆకాంక్ష‌తో పోరాటం చేసి, సొనియ‌మ్మ క‌రుణ‌తో తెలంగాణ సాధించుకున్నామ‌ని, కానీ తెలంగాణ పోరాట యోధుల ఆకాంక్ష‌ల‌ను కొత్తగా అధికారంలోకి వ‌చ్చిన ప్ర‌భుత్వం నెర‌వేర్చ‌లేక‌పోయింద‌ని అన్నారు. కేసిఆర్ ముఖ్య‌మంత్రి తెలంగాణ లోని ఏ ఒక్క వ‌ర్గానికి సంబంధించి అకాంక్ష‌ల‌ను కూడా నెర‌వేర్చ‌లేద‌ని, తెలంగాణ ప్ర‌జ‌ల బ‌తుకుల‌ను చీక‌టి మ‌యం చేశార‌ని అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ‌లో ప్ర‌జ‌ల బ‌తుకులు వెలుగుతో నిండాల్సింది ఉండ‌గా కేసిఆర్ నియంత‌, అహాంకార పూరిత పాల‌నతో ప్ర‌జ‌ల బ‌తుకులు మోడువారి పోయాయ‌ని అన్నారు. రాబోయే ఎన్నిక‌ల‌లో తెలంగాణ‌లో కాంగ్రెస్ విజ‌యం సాధిస్తుంద‌ని తెలంగాణ ప్ర‌జ‌ల జీవితాల‌లో వెలుగు నింపుతుంద‌న అన్నారు. ఈ దీపావ‌ళి పండుగ తెలంగాణ ప్ర‌జ‌లు సుఖ సంతోషాల‌తో జ‌రుపుకోవాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు