టీఆర్ ఎస్ లో చేరిన వంటేరు ప్రతాప్ రెడ్డి. గజ్వేల్ లో కాంగ్రెస్ ‘క్లీన్ బౌల్డ్’ !!

టీఆర్ ఎస్ లో చేరిన వంటేరు ప్రతాప్ రెడ్డి.
గజ్వేల్ లో కాంగ్రెస్ ‘క్లీన్ బౌల్డ్’ !!

vanteru entry to trs

హైదరాబాద్:

trs వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో
గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు
వంటేరు ప్రతాపరెడ్డి టిఆర్ఎస్ లో చేరారు.
తనను 2009, 2014, 2018 లో trs లోకి రావాలని కేటీఆర్ ఆహ్వానించినట్టు వంటేరు తెలిపారు.సీఎం కేసీఆర్ తీసుకున్న సంక్షేమ పథకాలకే ప్రజలు బ్రహ్మరథం పట్టి, trs ను అత్యధిక స్థానాల్లో గెలిపించారని ఆయన అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఘన విజయం సాధించారని చెప్పారు.కేసీఆర్ నిర్ణయమే సరయినదని, తన నిర్ణయం తప్పని వంటేరు చెప్పారు.గజ్వేల్ లో ప్రాజెక్టులు పూర్తి కావడమే తన లక్ష్యమని ప్రకటించారు.
గజ్వేల్ కు ఎలా నిధుల వరద పారుతుందో, ఎంత అభివృద్ధి జరిగిందో ప్రజలకు తెలుసునని కేటీఆర్ చెప్పారు.కోటి ఎకరాల తెలంగాణ మాగానం కావాలని కేసీఆర్ పెట్టుకున్న కల త్వరలోనే నెరవేరబోతోందన్నారు.కేసీఆర్ నేతృత్వంలోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని ప్రజలు అఖండ విజయాన్ని కట్టబెట్టారని టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పారు.2018 ఎన్నికల్లో 47-50% ప్రజలు trs కు ఓట్లు వేశారని గుర్తు చేశారు.
ఓడిపోయిన చోట కూడా అతి తక్కువ తేడాతో ఓడిపోయామని చెప్పారు.ఆసిఫాబాద్ లో 180 ఓట్ల తేడాతో ఓడిపోయామన్నారు.75% స్థానాలను తెరాస కు ప్రజలు కట్టబెట్టారని చెప్పారు.”మనం అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగాలంటే కేంద్ర ప్రభుత్వాన్ని మనం శాశించాల్సిన అవసరం ఉంది. 16 పార్లమెంట్ స్థానాలను గెలవాలి.దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తనకుతానుగా 100 కు పైగా స్థానాలు వచ్చే అవకాశం లేదు.బీజేపీ అంటే బిల్డప్ పార్టీ.
పీఎం సహా పలువురు బీజేపీ సీఎం లు తెలంగాణ లో ప్రచారం చేసినా 103 అసెంబ్లీ స్థానాల్లో డిపాజిట్ కూడా రాలేదు.రాష్ట్రాలను బలోపేతం చేయాల్సిన దృష్టి తో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ని తీసుకువచ్చారు.కాంగ్రెస్, బీజేపీ రెండూ కలిసినా మ్యాజిక్ ఫిగర్ సాధించే అవకాశం లేదు.ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్ కూడా బీజేపీ, కాంగ్రెస్ యేతర పార్టీకే మద్దతు అంటున్నారు.వైసీపీ చీఫ్ జగన్ కూడా కేంద్రo లో మనమే చక్రం తిప్పేలా ఉండాలని అంటున్నారు.చంద్రబాబు సోనియా ను ఎన్నో మాటలు అని ఇప్పుడు సిగ్గులేకుండా కాంగ్రెస్ తో జట్టు కట్టారు.దేశంలో గుణాత్మకమైన మార్పుకోసం కేసీఆర్ దేశవ్యాప్తంగా తిరిగి అందరి మద్దతు కూడగడుతున్నారు.నాలుగున్నరేళ్లు మోడీ తో సంసారం చేసిన చంద్రబాబు ఇవాళ బయటికి వచ్చి తన చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఇతరులను బూచిగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.అన్నదమ్ముల్లా విడిపోదాం అభివృద్ధి లో కలిసుందాం అన్నాం.ఎక్కడా మేము ఏపీ కి వ్యతిరేకంగా వ్యవహరించలేదు.ఇక్కడ సీమాంధ్రులు కేసీఆర్ కి ఓటు వేసి గెలిపించారంటేనే వాళ్ళని మేము ఎలా గుండెల్లో పెట్టి చూసుకున్నామో మీకే అర్ధం అవుతుంది.కెసిఆర్ పై, trs పై అక్కస్సుతో చంద్రబాబు మాట్లాడుతున్నారు.జాతీయ స్థాయిలో నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ నినాదంతో దేశ రాజకీయాలను శాశించే దిశగా ఉంటాం.
తెలంగాణ లో కోపం వచ్చినా… ప్రేమ వచ్చినా ఆగదు. ఆ తర్వాత అంతా మంచిగానే కలిసుంటాం.రాష్ట్ర అభివృద్ధికోసం అందరం కలిసి పనిచేద్దాం. తెరాస లో చేరిన ప్రతాప్ రెడ్డికి అభినందనలు” అని కేటీఆర్ అన్నారు.