గెలుపుకోసం కోట్లు. ఓడితే కట్టలు తెంచుకునే దుక్ఖం!!

గెలుపుకోసం కోట్లు.
ఓడితే కట్టలు తెంచుకునే దుక్ఖం!!

ఖమ్మం:

ఎన్నికలంటే ఎన్నికలే.ఏ ఎన్నికలైనా ఒకటే.డబ్బు,మద్యం, ఇతర ప్రలోభాలు….గ్రామ పంచాయతీ ఎన్నికల నుంచి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల వరకు ఇదే తంతు. ఏ ఎన్నికను అయినా రాజకీయ నాయకులు, పార్టీలు పరువు, ప్రతిష్టలుగా తీసుకుంటున్నందున లక్షలు,కోట్లను నీళ్ల కంటే నీచంగా ఖర్చు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో కొన్ని చోట్ల ఒక్కో ఓటుకు 5 వేల రూపాయలు కూడా ఇచ్చారంటే పరిస్థితి తీవ్రతను అంచనా వేయవచ్చు. తల తాకట్టు పెట్టి అయినా గెలవాలన్నది లక్ష్యం. ఓడిపోతే ఏడ్పులు,పెడబొబ్బలు ఇప్పుడొక కొత్త ట్రెండు.సూర్యాపేట నియోజకవర్గం చివ్వెంల (మం) అక్కలదేవిగూడెం గ్రామ సర్పంచ్ అబ్యర్ది జానకి రాములు ఓడి పోవటంతో రోధిస్తున్న కుటుంబ సభ్యుల వీడియో ఇది!!