వైరల్ వీడియో: మనిషా..రబ్బరు బొమ్మా?

వైరల్ వీడియో: మనిషా..రబ్బరు బొమ్మా?
Viral Video Manisha

సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా ఒక మహిళా జిమ్నాస్ట్ వీడియో ధూమ్ ధామ్ చేస్తోంది. వీడియోలో జిమ్నాస్టిక్స్ విన్యాసాలు చేస్తున్న అమ్మాయిని చూస్తూ ప్రేక్షకులంతా కనురెప్ప వేయడం మరచిపోయారు. కేటలిన్ ఒహాషి అనే ఈ జిమ్నాస్ట్ విన్యాసాల వీడియోని ఇప్పటి వరకు కోట్లాది మంది చూశారు. లక్షల్లో షేర్ చేశారు. ఈ వీడియో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజెల్స్ (UCLA) కి చెందినది. వాళ్లే ఈ వీడియోని మొదటిసారి షేర్ చేశారు.

కేటలిన్ ఒహాషి ఈ యూనివర్సిటీలోనే చదువుతోంది. యూనివర్సిటీ జిమ్నాస్టిక్స్ జట్టులో ఆమె సభ్యురాలు. అక్కడ నిర్వహించిన ఓ పోటీలో ఆమె చేసిన అద్భుత విన్యాసాల కారణంగా ఒహాషీ టీమ్ విజేతగా నిలిచింది. ఆమె జట్టుకి మొత్తంగా 197.700 స్కోర్ వచ్చినట్టు తెలిసింది.
వీడియోలో ఒహాషి జిమ్నాస్టిక్స్ లో ఒక భాగమైన ఫ్లోర్ రొటీన్ చేస్తూ కనిపిస్తుంది. ఇందులో జంపింగ్, విన్యాసాలు, హ్యాండ్ స్టాండ్, ఇతర విన్యాసాలు ఉంటాయి. ఫ్లోర్ రొటీన్ లో ఒహాషీ పర్ఫెక్ట్ 10 సాధించింది. ఒక్క ఫ్లోర్ రొటీన్ లోనే కాదు ఇతర విభాగాల్లోనూ ఒహాషీ మంచి ప్రదర్శన కనబరిచింది. జిమ్నాస్టిక్స్ బ్యాలెన్స్ బీమ్ లో ఆమెకు 9.975 పాయింట్లు లభించాయి.