కాంగ్రేస్ తాత్కాలిక అధ్యక్షునిగా ఓరా!!

న్యూఢిల్లీ:

కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షులుగా సీనియర్ నేత మోతిలాల్ వోరా నియమితులయ్యారు. రాహుల్ గాంధీ తన రాజీనామాకు కట్టుబడి ఉన్నట్లు ఈరోజు మరోమారు ప్రకటించటంతో ఆయన రాజీనామాను సీడబ్యూసీ మధ్యాహ్నం ఆమోదించింది. తాత్కాలిక అధ్యక్షుడిగా 50 సంవత్సరాలుగా గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉంటున్న వోరాను సీడబ్ల్యూసీ నియమించింది. మోతీలాల్ వోరా గతంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, ఏఐసీసీ కోశాధికారిగా పనిచేశారు. కాంగ్రెస్ లో ఏర్పడిన ‘రాజీనామా’ సంక్షోభానికి తాత్కాలికంగా తెరపడింది.