వైరల్ వీడియో: బాబోయ్.. ఎంత పెద్ద రంధ్రమో!!

రష్యాలో బుధవారం అకస్మాత్తుగా ఒక వింత చోటు చేసుకుంది. తులా నగరానికి సమీపాన ఉన్న డెడిలోవో గ్రామంలోని ఒక ప్రైవేట్ కూరగాయల తోటని లోపలికి లాగేసుకుంటూ భూ ఉపరితలంపై ఓ భారీ రంధ్రం ఏర్పడింది. ఇది ఒక బహుళ అంతస్థుల భవనం అంత లోతుగా ఉంది. దీని పరిమాణం చూసినా విన్నా గుండెలు జారిపోవడం ఖాయం. ఈ రంధ్రం వ్యాసం 49 అడుగులు కాగా లోతు 98 అడుగులు. చుట్టుపక్కల అంతా ఆకుపచ్చగా ఉన్న తోట మధ్యలో ఈ భారీ రంధ్రం ఉన్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో సంచలనం రేపుతోంది. దీనికి సమీపంలో కొన్ని భవనాలు కూడా ఉన్నాయి. కానీ ఈ రంధ్రం కారణంగా ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Watch: Giant Sinkhole, Deep As Multi-Storey Building, Opens Up In Russia

World, International, Europe, Russia, Sinkhole, Giant Sinkhole, Deep, Multi-Storey Building, Opens up, Viral, Video, Viral Video, Social Media