వీడియో: టోల్ ప్లాజా దగ్గర పిస్టల్ తో బెదిరింపు, ఇద్దరి అరెస్ట్

హర్యానాలోని గురుగ్రామ్ దగ్గర బుధవారం టోల్ ట్యాక్స్ కట్టకుండా పిస్తోలుతో బెదిరించి పరారైన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డయింది. ఈ ఫుటేజీ ఆధారంగా వివరాలు తెలుసుకున్న పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిపై కేసు నమోదు చేశారు. ‘ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. వారి దగ్గర నకిలీ తుపాకీ ఉందని’ గురుగ్రామ్ ఏఎస్పీ షాషేర్ సింగ్ చెప్పారు.

గురుగ్రామ్ టోల్ ప్లాజా దగ్గర ట్యాక్స్ కట్టమని అడగగా ఒక వ్యక్తి దురుసుగా ప్రవర్తించాడు. కారులో ఇద్దరు యువకులు ఉన్నారు. టోల్ ప్లాజా ఉద్యోగి టోల్ ఇవ్వాలని కోరగా ఇద్దరు యువకులు కారు నుంచి దిగారు. ఒకరు ఆ ఉద్యోగిపై పిస్టల్ గురిపెట్టి చంపేస్తానని బెదిరించాడు. బ్యారియర్ ఎత్తేశాడు. రెండో వ్యక్తి కారు నడుపుతూ ముందుకు రాగానే ఇద్దరు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన టోల్ దగ్గర ఏర్పాటు చేసిన సీసీటీవీలో రికార్డయ్యాయి. టోల్ మేనేజర్ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Watch: Man flashes pistol at Gurugram toll plaza, flees without paying toll tax

India, National, Haryana, Gurugram, Gurgaon, Toll Plaza, Toll Plaza Violence, Case, Registered, Toll Attendent, Gun, Boom Barriers, Police, Investigation, New Delhi City Crime, Gurugram Toll Plaza, Toll Tax Payment, Pistol at Toll Plaza, Police FIR, Crime in Gurugram, Gurugram Police, Toll Tax

Attachments area