‘ప్రజాకూటమి’ లోనే కొనసాగుతాం. కోదండరామ్:

హైదరాబాద్:
కూటమిలో కాంగ్రెస్ పార్టీదే పెద్దన్న పాత్ర అని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు.కేసీఆర్ దుష్టపాలనకు వ్యతిరేకంగా కూటమి ఏర్పాటయ్యినట్టు తెలిపారు.
“మా ప్రయత్నం మేము కొనసాగిస్తాం కూటమిలోనే కొనసాగుతం.సీట్ల సర్దుబాటు సంబంధించి మేము ఇప్పటివరకు ఎక్కడ మాట్లాడలేదు.”అని కోదండరాం చెప్పారు.”రాజకీయ ఆధిపత్యంతో కేసీఆర్ ప్రభుత్వం ముందుకు వెళ్ళింది. రాష్ట్రంలో కె ఫోర్ పాలన కొనసాగింది. భావ సారూప్యత కారణంగానే కూటమిగా ఏర్పడింది..ఆ కారణంగానే ఆచితూచి అడుగులు వేస్తున్నాం.
టిఆర్ ఎస్ పార్టీ నేతలను ప్రజాక్షేత్రంలో ప్రజలు నిలదీస్తున్నారు.మేము కన్నెర్ర చేస్తే కేసిఆర్ కుటుంబం కాలగర్భంలో కలిసిపోతుంది.మా నేతలకు న్యాయం చేయాల్సిన బాధ్యత మాపై ఉంటుంది.” అని టిటిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు.”కూటమిని మరింత బలోపేతం కోసం మేము కృషి చేస్తాం.కెసిఆర్ విపక్షాలను భయాందోళనకు గురి చేస్తున్నారు. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య కూటమిగా ఏర్పడాం. ప్రజల ముందుకు మ్యానిఫెస్టోను తీసుకెళ్దాం..ప్రజామోదంతో మేనిఫెస్టో ప్రకటించనున్నట్టు తెలిపారు.