మాయమైన ఏఎన్-32 విమాన శకలాల గుర్తింపు

ఎనిమిది రోజుల క్రితం అదృశ్యమైన భారతీయ వాయుసేనకు చెందిన ఏఎన్-32 విమాన శకలాలు లభించాయి. విమాన శకలాలు అరుణాచల్ ప్రదేశ్ లోని లిపోలో ఉత్తర ప్రాంతంలో దొరికాయి. ఈ విమానం జూన్ 3న జోరాహట్ ఎయిర్ పోర్ట్ నుంచి బయల్దేరిన తర్వాత మాయమైంది. ఇందులో 13 మంది ప్రయాణిస్తున్నారు. ఐఏఎఫ్ కి చెందిన ఎంఐ-17 హెలికాప్టర్ ఈ శకలాలను తీసుకొచ్చింది. ఏఎన్-32 విమానం చివరిసారిగా జూన్ 3న అరుణాచల్ ప్రదేశ్ లోని గ్రౌండ్ కంట్రోల్ తో కాంటాక్ట్ చేసింది.


అదృశ్యమైన ఏఎన్-32 విమాన శకలాలు లిపోకి ఉత్తరాన 16 కిలోమీటర్ల దూరంలో ఎంఐ-17 హెలికాప్టర్ కి కనిపించినట్టు ఐఏఎఫ్ ప్రకటించింది. విమాన శకలాలు కనిపించిన ప్రదేశం అరుణాచల్ ప్రదేశ్ లో ఏఎన్-32 ప్రయాణించాల్సిన మార్గానికి సుమారు 15-20 కి.మీలు ఉత్తరాన ఉంది. ఈ ప్రమాదంలో ఎవరైనా బతికి బయటపడ్డారా తెలుసుకొనేందుకు ఐఏఎఫ్ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. తదుపరి సమాచారం త్వరలోనే తెలియజేస్తామని తెలిపింది.

Wreckage of Missing AN-32 Aircraft Spotted in Arunachal Pradesh After Eight-Day Search