కేసీఆర్ ‘ఫ్రంట్’ కు మద్దతు!! – వై.ఎస్.జగన్:

కేసీఆర్ ‘ఫ్రంట్’ కు మద్దతు!!
– వై.ఎస్.జగన్:
YS Jagan Supports for KCR Front

హైదరాబాద్:

తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్లో మాట్లాడిన తర్వాత కేటీఆర్ వచ్చి కలిశారని, ఇద్దరం రాష్ట్రాల సమస్యలు, ఫెడరల్ ఫ్రంట్ అంశాలపై చర్చించామని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చెప్పారు.రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాలపై చర్చించామని, అన్యాయం జరగకుండా ఉండాలంటే దేశ వ్యాప్తంగా రాష్ట్రాలు కలవవలసిన అవసరం ఉందన్నారు.
పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చినా న్యాయం జరగలేదన్నారు.
రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్న పరిస్థితులను అధిగమించాలంటే ఒక్కో రాష్ట్రంలో ఉన్న ఎంపీలు మాత్రమే పోరాడితే సమస్యలు పరిష్కారం కావని జగన్ అభిప్రాయపడ్డారు.సంఖ్యాపరంగా రాష్ట్రాల్లో ఎంపీల సంఖ్య తక్కువగా ఉంటుందన్నారు. ఏపీలో ఉన్న 25 మంది ఎంపీలతో పాటు, తెలంగాణలో ఉన్న 17 మంది ఎంపీలు కలిసి 42 మంది ఒకేతాటిపై పోరాడితే కావాల్సినవి సాధించేందుకు ఆస్కారం ఉంటుందని చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు జగన్ స్వాగతం పలికారు.రాష్ట్రాల హక్కులు కాపాడాలంటే సంఖ్యాపరంగా ఎంపీల నెంబర్ పెరగాలని కోరారు.అప్పుడే కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాలకు అన్యాయం చేసే దిశగా అడుగులు వేయవన్నారు. ఈ దిశగా కేసీఆర్ ప్రతిపాదించిన జాతీయ ప్లాట్ ఫాంవైపు రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చి ఒకటవ్వాలని కోరారు.ఎంపీల పరంగా నంబర్ ను పెంచగలిగితే రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా కోరుకున్నవి సాధించగలుగుతామన్నారు.కేసీఆర్ రూపొందిస్తున్న జాతీయ ప్లాట్ ఫాం అనేది హర్షించదగినదని చెప్పారు.కేటీఆర్ ఆ విషయంపైనే చర్చించారని,కేసీఆర్ కూడా తనతో
ఫోన్లో మాట్లాడారని జగన్ తెలిపారు.తర్వలో కేసీఆర్ స్వయంగా వచ్చి తనతో చర్చించనున్నట్టు చెప్పారు. పార్టీలో చర్చించి రాబోయే రోజుల్లో ముందుకు అడుగులు వేస్తామని, పార్లమెంట్ లో ప్రాంతీయ పార్టీల ఎంపీల సంఖ్యాబలం పెరగాలన్నారు.ప్రాథమిక చర్చలు మాత్రమే జరిగాయని, కేసీఆర్ తో చర్చల
అనంతరం ఫెడరల్ ఫ్రంట్ ఒక రూపు దాల్చిన తర్వాత అనేక అంశాలు వివరిస్తామని జగన్ వివరించారు. 25 మంది ఎంపీలతో ప్రత్యేక హోదా సాధించలేనప్పుడు ఆ సంఖ్యను 42కు పెంచి ఒత్తిడి తీవ్రం చేయాల్సిన అవసరం ఉందని
జగన్ అన్నారు.దేశంలో రాజకీయ ప్రత్యామ్నాయం కోసం కెసిఆర్ దేశంలో చాలా మంది నేతలతో మాట్లాడుతున్నారని,అందులో భాగం గానే నిన్న కెసిఆర్ జగన్ తో ఫోన్ లో మాట్లాడారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు.ఈ రోజు ఇంటికి రమ్మని జగన్ ఆహ్వానించడం తో వచ్చామని తెలిపారు.జగన్ ,ఇతర వైసీపీ నేతలతో ఫెడరల్ ఫ్రంట్ పై చర్చలు జరిగాయన్నారు.”త్వరలో మా అధినేత ,సీఎం కెసిఆర్ విజయ వాడ వెళ్లి జగన్ తో మరింత లోతుగా చర్చిస్తారు. ఈ రోజు జరిగింది మొదటి సమావేశం మాత్రమే. ప్రత్యేక హోదా పై సీఎం కెసిఆర్ ఇప్పటికే trs వైఖరి చెప్పారు.ఈ రోజే అన్ని చెప్పేస్తే మీడియా కు రాసుకోవడానికి ఏం మిగలదు” అని కేటీఆర్ అన్నారు.