షర్మిల ఫిర్యాదుపై దర్యాప్తు!

YS Sharmila Case Investiagtion

హైదరాబాద్:

వైస్.షర్మిళ ఇచ్చిన ఫిర్యాదుఫై దర్యాప్తు ప్రారంభం అయినట్టు సైబర్ క్రైమ్ అడీషనల్ డీసీపీ రఘువీర్ తెలిపారు.షర్మిల -ప్రభాస్ ఫై యూ ట్యూబ్ లో పెట్టిన వీడియోలఫై ‘యూ ట్యూబ్’ కి లెటర్ రాసామని చెప్పారు.మొత్తం 23 మంది ఫై ఆమె ఫిర్యాదు చేసారని డీసీపీ తెలిపారు.2014 లో ఇదే ఇస్స్యూ ఫై ముగ్గురి ని అరెస్ట్ చేసామని ఆయన చెప్పారు.మళ్లీ ‘యూ ట్యూబు’ లో ట్రోలింగ్స్ స్టార్ట్ చేశారని చెప్పారు.
మొత్తం 23 ‘యూట్యూబ్ లింక్ ల’ ఫై విచారణ జరుపుతున్నామని డీసీపీ తెలిపారు.ఈ వీడియోలు ఎవరు పెట్టిస్తున్నారో ఇంకా బయటపడలేదన్నారు.యూ ట్యూబు,గూగుల్ కి వివరాలు ఇవ్వాలని లెటర్ రాసామని రఘువీర్ తెలిపారు.15 రోజులలో ‘యూ ట్యూబు’, ‘గూగుల్’ రెస్పాండ్ అయ్యే అవకాశం ఉందన్నారు.