అంతం కాదిది ఆరంభం…!!


zakeer.sk:

టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కుటుంబానికి పెట్టని గోడ , కట్టని మేడ .. “మై హోం”. అలాంటి ఆ తలుపే తట్టారంటే, ఆల్మోస్ట్ కేసీఆర్ ను టచ్ చేసినట్టే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. టీఆర్ఎస్ ప్రభుత్వానికి , కేసీఆర్ కు కౌంట్ డౌన్ మొదలైందంటున్నారు . అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం గురువారం తెలతెల్లవారుతుండగా ఐటీ అధికారులు మైహోమ్ రామేశ్వరరావు తలుపు తట్టారు .. ఏకకాలంలో ఇళ్లు , ఆఫీసు , ఇతర ప్రధాన కార్యాలయాలు , ఆర్థిక లావాదేవీల కేంద్రాలపై విరుచుపడ్డారు ।. గురువారం రాత్రంతా ఐటీ అధికారుల సోదాలు సాగినట్టు చెబుతున్నారు .. తెలంగాణ నడిబొడ్జున… కేసీఆర్ ముఖ్యమంత్రి హోదా లో ఉండగా .. అదీ కేసీఆర్ నివాసానికి కూత వేటు దూరంలో , మై హోమ్ రామేశ్వరరావు ను టచ్ చేశారంటే , ఇది ఖచ్చితం గా కేంద్రంపనేనంటున్నారు.. కేసీఆర్ ఆపలేకపోయారా..?? ఆపినా వారు వినలేదా..?? ఐటీ అధికారుల సాహసం వెనకాల ధైర్యం ఏంటి..?? ఇవన్నీ తేలాల్సిన ప్రశ్నలు..!
టార్గెట్ తెలంగాణ గా పావులు కదుపుతున్న బీజేపీ .. కేసీఆర్ ను లక్ష్యంగా ఎంచున్నట్టు కనిపిస్తోంది. కాస్త టైం తీసుకుంటారీని అంతా భావించినప్పటికీ అమిషా కు అంత ఓపిక లేనట్టు కనిపిస్తోంది.. నేరుగా ఏనుగు కుంభస్థలాన్నే కొట్టారు … డేంజర్ బెల్స్ మోగించి కేసీఆర్ మూలాలను పెకిలించే పనిలో పడినట్టు కనిపిస్తోంది. ఈ ఐటీ దాడులు ఇంతటితో ఆగేట్టు కనిపించడం లేదు .. ఐటీ ఒక్కటేనా..।?? ఈడీ..?? సీబీఐ ?? లాంటి సంస్థలు కూడా తెలంగాణ మీద దండెత్తుతాయా అన్నది అధికార పార్టీల నేతలను కలవరపెడుతుంది.. ఎందుకంటే మన సోదర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సో అప్పటి అధికార పార్టీ ఎంపీలు , తమ ప్రభుత్వంలోనే కేంద్రమంత్రి గా పని చేసిన వారినే టార్గెట్ చేసిన చరిత్ర బీజేపీ దీ, మోడీ సర్కార్ ది .. ఇపుడు అదే ప్లాన్ తెలంగాణ మీద ప్రయోగిస్తున్నట్టు కనిపిస్తోంది …