అంతా వచ్చేశారు. ‘గ్రేట్ ఎస్కేప్’.

థాయిలాండ్:
థామ్ లువాంగ్ గుహలో ప్రపంచం కనీవినీ ఎరుగని అత్యద్భుతం ఆవిష్కృతమైంది. వైల్డ్ బోర్ సాకర్ టీమ్ కి చెందిన 13 మంది సభ్యులు సురక్షితంగా ప్రాణాలతో బయటికి వచ్చారు. వరదనీటితో నిండిన గుహల నుంచి కోచ్ సహా పిల్లలంతా ప్రాణాలతో భద్రంగా బయట పడినట్టు తెలిసింది. గుహలో నిండిన వరదనీటిలో ఈదుకుంటూ బయటికొచ్చారు. నీటిలో ఈదేటపుడు పిల్లలు భయపడకుండా ఉండేందుకు ఆస్ట్రేలియాకు చెందిన వైద్యుడు వారికి అతి తక్కువ మోతాదులో మత్తుమందు ఇచ్చారు. స్కూబా డైవర్లు ధరించే ఫుల్ ఫేస్ మాస్కులు, వెట్ సూట్లు వేసుకొన్న పిల్లలంతా డైవర్ల బృందం సూచనలను తూచ తప్పకుండా అనుసరించినట్టు సహాయ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్న అధికారులు తెలిపారు. కోచ్ ఒక్కరూ మాత్రం సహాయ బృందం ఏర్పాటు చేసుకొన్న మూడో గుహ దగ్గర ఆగి ఉన్నట్టు సమాచారం. త్వరలోనే ఆయన కూడా బయటికి వస్తారు.