అంతులేని కథ అల్వాల్ గ్రీన్ ఫీల్డ్స్.

హైదరాబాద్:

అల్వాల్ గ్రీన్ ఫీల్డ్ భూముల వ్యవహారం అంతులేని కథగా మారింది. 80వ దశకంలో అష్టకష్టాలు పడి కోనుగోలు చేసుకున్న ప్లాట్లకి.. ముప్పైయేళ్లు అయినా యజమానులు ఇళ్లు నిర్మించుకోలేకపోతున్నారు. ఎవరి ప్రభుత్వం ఉంటే వారిదే పెత్తనంలా అక్కడ దందా కొనసాగుతోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రోజుకో కబ్జాదారుడు పుట్టుకొస్తున్నారు. అసలు మళ్లీ మళ్లీ ఈ గ్రీన్ ఫిల్డ్స్ వ్యవహారం ఎందుకు తెర పైకి వస్తుంది.. ఏ అధికారి అండదండలతో యధేచ్ఛగా కబ్జాలు జరుగుతున్నాయి.వీరంతా యవ్వనం దశలో గూడు కోసం ప్లాట్లు కోనుగోలు చేశారు. మొత్తం 1000 మంది 63 ఎకరాల్లో కనాజీగూఢలోని వివిధ సర్వే నెంబర్లలో ప్లాట్ తీసుకున్నారు. గ్రీన్ పిల్డ్స్ ప్లాట్ ఓనర్స్ పేరుతో అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నారు. 1984 నుంచి 1996 వరకు వీరికి ఎలాంటి ఇబ్బందులు లేవు. కాని మాజీ మంత్రి శంకర్ రావు 63 ఎకరాల భూమి తమదని లీగల్ నోటీసులు ఇచ్చారు. అయితే ఈ భూమి అంతా ప్రభుత్వానికి చెందినదేనని ఈ అంశంపై ఆర్డీఓ, హైకోర్టు, సుప్రీం కోర్టు క్లారిటీ ఇచ్చింది. ఈ కబ్జా కేసులో శంకర్‌రావు అరెస్ట్ కూడా అయ్యారు. గ్రీన్ ఫీల్డ్ భూములు ప్రభుత్వ భూమని తెటతెల్లం కావడంతో .. అటు రాజకీయంగా పలుకుబడి ఉన్న నేతలు, చోటామోట రౌడీ మూకలు, ప్రభుత్వ ఉద్యోగంలో కీలక పోస్టింగ్‌లో ఉన్న వారు.. వారి కుటుంబ సభ్యులతో కలిసి కబ్జా చేసేందుకు సిద్దమయ్యారని బాధితులు అరోపిస్తున్నారు.ఇప్పటికీ ఇంకా కబ్జా కోరుల చేతిలోనే 10 ఎకరాల ప్లాట్స్ ఉన్నయని బాధితులు అరోపిస్తున్నారు. జీ.వో. నెంబర్ 166 కింద రెగ్యూలరైజేషన్ చేసేందుకు దివంగత రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం అప్లికేషన్స్ తీసుకున్నా.. రెగ్యూలరైజేషన్స్‌కు నోచుకోలేదు. ఇదే ప్రభుత్వ భూమిని అండబలం అర్ధిక బలం ఉన్న వారు కబ్జా చేస్తున్నారు. మాజీ మంత్రి శంకరావు భూమిని కబ్జా చేస్తే ప్లాట్ల ఓనర్స్ కోర్టులో ఫైట్ చేశారు. ప్రభుత్వ అధికారులు వారికి సహాకరించారు. తాజాగా భూమిని కాపాడేందుకు ప్రభుత్వ అధికారులు ముందుకు రావడం లేదని అరోపణలు ఉన్నాయి.. ఇందుకు రంగారెడ్డి కలెక్టర్ మణికొండ రఘునందన్ రావు పాత్ర ఉందని ప్లాట్ ఓనర్స్ అరోపిస్తున్నారు. అతని సోదరుడు కేశవరావు .. సర్వే నెంబర్ 375లో 5 అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. తమ భూమిలో ఎలా అనుమతులు ఇస్తారని బాధితులు అవేదన వ్యక్తం చేస్తున్నారూ. కోన్ని ప్లాట్లలో మహాబూబ్‌నగర్ నుంచి వచ్చిన పేదవారితో గుడిసెలు వేయించి.. అతనే అద్దె వసూలు చేసుకుంటున్నారని అరోపిస్తున్నారు. తనకు 2002లోనే ప్రభుత్వం అక్యూపెన్సీ రైట్ సర్టిఫికేట్ ఇచ్చిందని .. దానిపై ఎవ్వరు కోర్టుకు వెళ్లలేదని ఆయన తెలిపారు. మీడియా ముందుకు రావాల్సిన అవసరం తనకు లేదని అంటున్నారు. 2002లో ఇచ్చిన ఓ.ఆర్.సీని సవాలు చేస్తూ 11777/2002 రిట్ పిటిషన్ దాఖలయింది. వీటితో పాటు మరో మూడు పిటిషన్స్‌ను విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్.. 2005 డిసెంబర్ 29న గ్రీన్ ఫీల్డ్స్ లోని సర్వే నెంబర్లు అంతా .. ప్రభుత్వ భూమియేనని స్పష్టం చేసింది. దీంతో ఓ.ఆర్.సి. రద్దయిందని అంటున్నారు ప్లాట్ల ఓనర్స్ అసోసియేషన్ నాయకులు. ప్రభుత్వ భూమిని అధికారులు కాపాడాల్సి ఉంది. కాని తన అన్న కలెక్టర్ కావడం.. కీలక బాధ్యతల్లో ఉండటంతో కేశవరావుకు జీ.హెచె.ఎం.సీ. నుంచి అనుమతులు తెచ్చుకున్నారని బాధితులు అరోపిస్తున్నారు. కోర్టు కేసుల్లో ఉన్న భూములకు రెవెన్యూ అధికారులు ఎన్.ఓ.సి. లేకుండానే ఎలా జీ.హెచ్.ఎం.సీ. అనుమతులు ఇచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ఓ.ఆర్.సీ. పై అధికారులు కుమ్మకు కావడం కాదు.. బహిరంగ చర్చకు రావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎడ్ల రమేష్ బాబు, 44 మందితో కలిసి.. ఓ.ఆర్.సీ. రాకముందు 1995లోనే తమకు అమ్మేశారని విక్రయ పేపర్స్ చూపిస్తున్నారు. రెవెన్యూ అధికారులు మాత్రం ప్రభుత్వ భూములను కాపాడుతామని రెగ్యూలర్ పదాలు చెప్పుతునే.. ఓ.ఆర్.సి. ఇంకా లైవ్‌లోనే ఉందని వివరణ ఇచ్చారు.
బైట్…మధుసుదన్.. ఆర్డీవో.. మేడ్చల్ జిల్లా.
ప్రభుత్వాలు మారుతున్నాయి. గ్రీన్ ఫీల్డ్స్‌లో కబ్జాదారుల పేర్లు మారుతున్నాయి.. రిటైర్డ్ అయి.. కొంత మంది చనిపోయినా.. వారి సొంతింటి కల మాత్రం నెరవేరడం లేదు. పెళ్లి చేసుకున్న కొత్తలో బంగారం అమ్మి ప్లాట్ కొనుగోలు చేసిన వాళ్లు .. ఇప్పుడు తమ ప్లాట్ కోసం పడుతున్న కష్టాలను చూసి .. కన్నీరు మున్నీరు అవుతున్నారు. వాడుపోతే.. వీడు.. వీడు..పోతే ఇంక్కొక్కడు కబ్జా అనే చందంగా గ్రీన్ ఫీల్డ్ భూములు మారాయి. రెగ్యూలరైజేషన్ చేస్తారని ఎన్నో యేళ్లుగా అశగా చూస్తున్నా.. స్థానికంగా ఉంటూ.. తమ పార్టీ అధికారంలోకి వస్తే చాలు.. గద్దల్లా వాలిపోవాలని అటు చోటామోటా నేతల నుంచి ఐ.ఏ.ఎస్. ఫ్యామిలీ వరకు వేచి చూస్తున్నారు. టీ.ఆర్.ఎస్. సర్కార్ ఇప్పటికైనా వెయ్యి మంది ప్లాట్ల పై దృష్టిపెట్టకపోతే.. అటు వారికి న్యాయం జరగదు. ఇటు ప్రభుత్వ భూమి ప్రభుత్వానికి కాకుండా పోతుందని స్థానికులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. జీ.హెచ్.ఎం.సీ. అధికారుల నిలువెత్తు నిర్లక్ష్యానికి.. ప్రభుత్వ భూముల్లో ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఎస్.వి.ఎస్. ఎన్ క్లెవ్. వినోద్ పేరుతో సామాన్యులకు ఈ ప్లాట్స్ విక్రయిస్తున్నారు. కష్టపడి కోనుగోలు చేసిన తరువాత.. ప్రభుత్వ భూమిలో నిర్మించారని కూల్చివేసిన ఘనకార్యాలు గ్రేటర్ హైదరాబాద్ అధికారులకు లేకపోలేదు. సో.. అధికారం, కీలక భాద్యతలు ఉంటే చాలు ప్రభుత్వ భూమిని మింగేసేందుకు కుట్రలు పన్ని పని కానిచ్చేస్తున్నారు. ఓ.ఆర్.సి. పై స్పష్టత ఇచ్చి సర్వే చేసి.. ఎవ్వరి భూమి ఎవరిదో ఎలాంటి వివాదం లేకుండా చేయాల్సిన బాధ్యత .. రెవెన్యూ అధికారుల పై ఉంది.