అనారోగ్యంతో చిరుత మృతి.

హైదరాబాద్:
దీప అనే చిరుతపులి(22) అనారోగ్యంతో బుధవారం రాత్రి మరణించినట్టు హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్ అధికారులు ప్రకటించారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధ పడుతున్న ‘దీప’కు నిపుణులు చికిత్స అందించినా ఫలితం లేకపోయిందని అన్నారు. గురువారం పోస్టు మార్టం నిర్వహించారు.