అమర్‌నాథ్ యాత్రకు బ్రేక్.

న్యూఢిల్లీ:
ప్రతికూల వాతావరణం కారణంగా అమర్నాధ్ యాత్రను తాత్కాలికంగా రద్దు చేశారు. భారీ వర్షాల కారణంగా విరిగిపడ్డ కొండచరియలు, దెబ్బతిన్న రోడ్లు.బాల్తాల్, పహల్‌గాం రెండు వైపుల నుంచి రద్దయిన యాత్ర. బురదమయంగా మారిన ట్రెక్కింగ్ మార్గాలు. యాత్రికులు జారిపడే ప్రమాదం ఉన్నందునే యాత్ర రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.వాతావరణం మెరుగయ్యాక యాత్రను పునరుద్ధరించే అవకాశం ఉంది. భారీ వర్షాల కారణంగా ఉప్పొంగి ప్రవహిస్తున్న జీలం నది. దక్షిణ కాశ్మీర్లోని సంగం వద్ద 21 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ప్రవాహం.ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పాఠశాలలకు సెలవు ప్రకటన. వరద ముప్పు హెచ్చరికలను విడుదల చేసిన యంత్రాంగం.