అమెరికా పోవడానికి మూటా ముల్లె సర్దుకో కేటీఆర్!-డి.కె. అరుణ.

మహబూబ్ నగర్..
నాలుగేళ్లు మోసం చేసి ఇపుడు కొత్త నాటకాలు ఆడుతున్నారు మీ డ్రామాలు ఇక సాగవు… ఇక నీకు రాజకీయ సన్యాసం తప్పదు అమెరికా పోనింకే ముఠా ముల్లె సర్దుకో కేటీఆర్ అని శాసనసభ్యురాలు డి.కె.అరుణ అన్నారు.
పాలమూరు కు నీళ్లిచిందే కాంగ్రెస్ పార్టీ.. వలసలను ఆపింది.. ప్రాణం పోసింది మా పార్టీ.
కావాలంటే మీ నాన్నను అడుగు..నాలుగు ప్రాజెక్టులు ప్రారంభించింది మా పార్టీనే..
తెలంగాణ ప్రజల కోసం ఖర్మకాలి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది.పాలమూరు ప్రాజెక్టులకు నిధులివ్వకుండా, కాళేశ్వరం కు మల్లిస్తున్నారని ఆమె విరుచుకుపడ్డారు.కరువు వలసల బారి నుంచి పాలమూరును తప్పించింది మా పార్టీ.హంద్రీనీవా కు హారతి పట్టింది అని మాట్లాడుతారు . మీకు సిగ్గుందా . అప్పట్లో మీ నాన్న మీ బావ ప్రభుత్వంలో భాగస్వాములని అరుణ విమర్శించారు. పాలమూరు ప్రజల గురించి మాట్లాడే అర్హత మీకు లేదన్నారు.
ప్రాజెక్టుల డిజైన్లు మార్చి ధనార్జన కోసం అంచనాలు మార్చి.. రైతులకు అన్యాయం చేస్తుంటే రైతులు కోర్టులకు పోతే తప్పేందన్నారు.
మీ నాన్న కన్నా ఎక్కువ తిడితే మంచి లీడర్ ఐతవను కుంటున్నావ్.. నోరు దగ్గర పెట్టుకో… పాలమూరులో 14 నియోజకవర్గాల్లో మిమ్మల్ని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.ఈ ప్రభుత్వం ఫోన్ tapping కి పాల్పడుతుందని ఆరోపించారు.ప్రతి ఫోన్ ట్యాపింగ్ అవుతుంది.ఇది దిగజారుడు పని.వెంటనే ఇది విరమించుకోవాలి.ఇది ప్రజల హక్కును హరించడమేనని అన్నారు.