అమెరికా సెక్స్ స్కాండల్. నాకు సంబంధం లేదన్న నటి మెహరీన్.

హైదరాబాద్:
అమెరికాలోని చికాగో కేంద్రంగా కిషన్ మోదుగుముడి దంపతులు నిర్వహించిన సెక్స్ స్కాండల్ తెలుగు రాష్ట్రాల్లో, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టించింది. సరిగ్గా సెక్స్ స్కాండల్ వెలుగుచూసిన సమయంలో హీరోయిన్ మెహరీన్ కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లింది. కెనడాలోని వాంకోవర్ నుంచి లాస్ వేగాస్‌కి హాలిడే ట్రిప్ ప్లాన్ చేసుకుంది. అప్పుడు అమెరికన్ బోర్డర్ సెక్యూరిటీ అధికారులు మెహరీన్ ఫ్యామిలీని 30 నిమిషాలు విచారించినట్టు ప్రముఖ ఆంగ్ల పత్రికలో వార్త వచ్చింది. మెహరీన్ తమకు ఇంటర్వ్యూ ఇచ్చినట్టు పత్రికలో పేర్కొన్నారు. అయితే… తాను ఎవరికీ ఎటువంటి ఇంటర్వ్యూ ఇవ్వలేదని ఆమె స్పష్టం చేసింది. తాజాగా ఆమె ట్విటర్ ద్వారా సంఘటనకు సంబంధించిన వివరాలను తెలియజేసింది.‘ఆ స్టోరీ పూర్తిగా అబద్ధం. నేనెవరికీ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. నాకు మీడియాతో మంచి రాపో ఉంది. మీడియా ఎప్పుడూ నన్ను ఎక్స్‌ట్రీమ్‌గానే చూపించింది. ముంబైలో వైరల్ ఫీవర్‌కు గురవడం కారణంగా నేను పంతం లాస్ట్ ప్రమోషనల్ ఈవెంట్‌ని నేను మిస్ అయ్యాను.
యూఎస్‌లో ఏం జరిగిందో.. దానికి సంబంధించి అసలు నిజాలివి. నేను నా ఫ్యామిలీతో కలిసి వాంకోవర్ నుంచి లాస్ వెగాస్‌కు వీకెండ్ హాలిడే కోసం వెళ్లాను. నేను ఇమ్మిగ్రేషన్ కోసం అధికారుల వద్దకు వెళ్లినపుడు నన్ను తెలుగు నటిగా గుర్తించారు. అప్పుడు యూఎస్ బోర్డర్ అఫీషియల్స్ నేను యూనైటెడ్ స్టేట్స్‌లో ప్రయాణించడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. అప్పుడు మొదటిసారి సెక్స్ స్కాండల్ గురించి అధికారులు చెప్పగా విన్నాను. ఆ ఇష్యూతో నాకు ఎలాంటి సంబంధం లేదని నిర్ధారించుకున్న అధికారులు… నాకు క్షమాపణ చెప్పి నా ప్రయాణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూశారు. ఇతరులు ఏదో చెప్పడం కంటే ఆ ఘటన గురించి నేనే చెప్పడం మంచిదని స్టేట్మెంట్ ఇస్తున్నా. నిజానికి నేను అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొన్న మాట వాస్తవమే కాని అది నా పర్సనల్ థింగ్. అయితే కొందరు చేసిన తప్పుడు పనుల కారణంగా ఇండస్ట్రీకి చెడ్డ పేరు రావడం బాధ కలిగిస్తోంది. తప్పు చేసిన వాళ్లకు సరైన శిక్ష పడుతుందని భావిస్తున్నా. నేను నా కష్టపడేతత్వాన్ని కొనసాగిస్తాను అలాగే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తాను. తెలుగు మూవీ ఇండస్ట్రీ చాలా మంచిది. దాని ఇమేజ్‌ను చెడగొట్టేలా నేను ప్రవర్తించను.ఈ ఘటన గురించి నేను మాట్లాడటం ఇదే చివరిసారి. నేను మీడియాకు రిక్వెస్ట్ చేస్తున్నా.. నన్ను సంప్రదించకుండా నా గురించి ఎలాంటి వార్తలు ప్రచురించవద్దు’’ అని ట్విటర్ ద్వారా తెలిపింది మెహ్రీన్.