అవసరమైతే హైదరాబాద్ కు గుమ్మడి నర్సయ్య తరలింపు. -మంత్రి తుమ్మల ఆదేశాలు.

ఖమ్మం:
గుమ్మడి నర్సయ్య గుండె నాళాలు (మూడు ) మూసుకుపోయినందున యాంజియోగ్రామ్ చెయాల్సి ఉంటుందని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నదని చెప్పారు. త్వరగానే కోలుకుంటారని, ఆందోళన అవసరం లేదన్నారు. మెరుగైన చికిత్స అందిస్తున్నామని వైద్యులు ప్రకటించారు.
‘ఆరోగ్య’ ఆసుపత్రి లో గుమ్మడి నర్సయ్య ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగు లేటి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. గుమ్మడి నర్సయ్య కండిషన్ పై ఆరోగ్య వైద్యులను అడిగి తెలుసుకున్న మంత్రి, ఎంపీ.. అవసరమైతే హైదరాబాద్ తరలించాలని మంత్రి తుమ్మల కోరారు.