ఆస్పత్రి బెడ్ మీద నుంచే వీడియో కాన్ఫరెన్స్.-పోచారం కొత్త ప్రక్రియ.

హైదరాబాద్:
రైతుబీమా వివరాల సేకరణ, వానాకాలం పంటల సాగుకు సన్నహాలపై వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులకు పలు సూచనలను చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పొచారం శ్రీనివాస రెడ్డి. నగరంలోని హాస్పిటల్ లో మోకాలి చిప్ప మార్పిడి శస్త్రచికిత్స జరిగి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న మంత్రి గారు హాస్పిటల్ బెడ్ మీద నుండే ఈరోజు సచివాలయంలో నుండి జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఫోన్ ద్వారా అధికారులకు సూచనలను, ఆదేశాలను అందించారు. కొన్ని జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడి రైతుబీమా వివరాల సేకరణ ఎంత శాతం పూర్తయినదో తెలుసుకున్నారు. రైతుల నుండి రైతుబీమా వివరాల సేకరణ, నామిని వివరాలను త్వరితంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కొన్ని జిల్లాల్లో మందకొడిగా సాగడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి గారు ఆయా జిల్లాల అధికారులు కష్టపడి పనిచేయాలని ఆదేశించారు. వివరాల సేకరణ త్వరితంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిదంగా వర్షాలు కురిసి రైతులు జోరుగా విత్తనాలను సాగు చేస్తున్నందున, రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచి సరఫరా చేయాలని ఆదేశించారు. రైతులకు ఎక్కడ కొరత లేకుండా అవసరమైన చర్యలను తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.