ఇంటింటికీ తాగునీరు సక్సెస్.

వరంగల్:
మిషన్ భగీరథ లో భాగంగా ధర్మసాగర్ మండల కేంద్రము లో నూతనంగా నిర్మించిన పుంపు హౌస్ ను ప్రారంభించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య. ఇంటింటికీ స్వచ్ఛమైన తాగు నీరు అందించి, ఆరోగ్య తెలంగాణను చేయాలనే గొప్ప సంకల్పంతో సీఎం కెసిఆర్ మిషన్ భగీరథ పతకాన్ని ప్రారంబించారని ఎమ్మెల్యే అరూరి రమేష్ తెలిపారు. ఎల్ఏండి నుండి ధర్మసాగర్ వరకు గల పంప్ హౌస్ ను ప్రారంబించడంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అరూరి రమేష్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ పుంపూ హౌజ్ ద్వారా వర్ధన్నపేట నియోజకవర్గంలో నాలుగు మండలాలు హసన్ పర్తి, ఐనవోలు, వర్ధన్నపేట, పర్వతగిరి మండలాలకు మిషన్ భగీరథ నీరు అందుతాయని తెలిపారు.