ఈనెల 26న శంషాబాద్ లో కేటిఆర్ బహిరంగ సభ.

హైదరాబాద్:
ఈ నెల 26 న శంషాబాద్ లో జరిగే బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. సభ ప్రాంగణాన్ని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, శంషాబాద్ ట్రాఫిక్ ఎసిపి ప్రసాద్, ఎయిర్‌పోర్ట్ సిఐ మహేష్, పరిశీలించారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో దాదాపు 100 కోట్లతో ప్రారంభోత్సవాలు, పెద్దఎత్తున కాంగ్రెస్, టిడిపి పార్టీకి చేంది నాయకులు, కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీలో చేరికలు ఉంటాయి. శంషాబాద్ లోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల గ్రౌండ్ లో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆద్వర్యంలో భారీ బహిరంగంగా సభ ఉంటుందని ముఖ్య అతిథి మంత్రి కేటిఆర్, రంగారెడ్డి జిల్లా మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, తో పాటు రంగారెడ్డి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెస్సీలు, ఎంపిలు, సర్పంచులు, పార్టీ అధ్యకార్యదర్శులు,నాయకులు పెద్ద ఎత్తున్న పాల్గొంటారని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలిపారు.