ఈ నెల 9 న ‘ రంగస్థలం’ 100 రోజుల వేడుక.

హైదరాబాద్:
కథలో బలం .. కథనంలో పట్టు ఉండాలిగానీ అది విజయమనే లక్ష్యాన్ని చేరుకొని తీరుతుందనే విషయాన్ని ‘రంగస్థలం’ నిరూపించింది. సుకుమార్ దర్శకత్వంలో చరణ్ .. సమంత జంటగా నటించిన ఈ సినిమా, విడుదలైన అన్ని ప్రాంతాల్లో విజయవిహారం చేసింది. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. వసూళ్ల విషయంలో కొత్త రికార్డులను నమోదు చేసిన ఈ సినిమా, తాజాగా 100 రోజులను పూర్తిచేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 15 సెంటర్లలో ఈ సినిమా 100 రోజుల మైలురాయిని దాటేసింది. ఈ సందర్భంగా ఈ సినిమా దర్శక నిర్మాతలు ఈ నెల 9వ తేదీన హైదరాబాద్ లో 100 రోజుల వేడుకను జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా చిరంజీవిని ఆహ్వానించినట్టు సమాచారం. మైత్రీ మూవీస్ వారు యూనిట్ సభ్యులకు ,బయ్యర్లకు ఈ వేదికపై 100 డేస్ షీల్డ్స్ ను అందజేస్తారు.