ఈ విజయం కేటీఆర్ కు అంకితం. – ఎమ్మెల్సీ పోచంపల్లి.

వరంగల్:

ఈ విజయాన్ని టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అంకితం చేస్తున్నట్టు ఎమ్మెల్సి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి సోమవారం ప్రకటించారు.
తనకు అవకాశం ఇచ్చిన దైవసమానులు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ కు, టిఆర్ఎస్ కార్యనిర్వాహక అద్యక్షులు కేటిఆర్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.తన గెలుపు బాధ్యతలు తీసుకుని జిల్లా ప్రజా ప్రతినిథులను,నాయకులను సమన్వయ పరిచి ఈ విజయానికి తోడ్పాటునందించిన రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాజ్యసభ సభ్యులు బండ ప్రకాశ్, రాష్ట్ర చైర్మన్లు వాసుదేవరెడ్డి,నాగుర్ల వెంకన్న,మర్రి యాదవ రెడ్డిలకు, ఉమ్మడి వరంగల్ జిల్లా నియోజక వర్గాల శాసన సభ సభ్యులు అరూరి రమేష్,చల్ల ధర్మారెడ్డి,పెద్ది సుదర్శన్ రెడ్డి,దాస్యం వినయ్ భాస్కర్,నన్నపునేని నరేందర్,తాటికొండ రాజయ్య,ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి,భానోత్ శంకర్ నాయక్,గండ్ర వెంకటరమణ రెడ్డిలకు, జిల్లా ప్రజాప్రతినిథులకు పోచంపల్లి కృతజ్ఞతలు చెప్పారు.