ఉగ్రవాదుల దాడి. కానిస్టేబుల్ మృతి.

  • ఉగ్రవాదుల దాడి.
    కానిస్టేబుల్ మృతి.

శ్రీనగర్:
జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో మరో యువకిశోరం ప్రాణాలు కోల్పోయారు. పుల్వామా కందిజాల్‌లో పోలీస్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. చికిత్స పొందుతూ కానిస్టేబుల్ తన్వీర్ అహ్మద్ తుది శ్వాస విడిచారు. ఇటీవలే ఉగ్రవాదుల దాడిలో రైజింగ్ కశ్మీర్ సంపాదకుడు షుజాత్ బుఖారీ చనిపోయారు. రంజాన్ పండుగ జరుపుకునేందుకు వెళ్తోన్న వీర జవాన్ ఔరంగజేబును ఉగ్రవాదులు అపహరించి దారుణంగా హత్య చేశారు. జమ్మూకశ్మీర్‌లో ప్రస్తుతం గవర్నర్ పాలన కొనసాగుతోంది.