ఉస్మానియాలో రాహుల్ గాంధీ సమావేశానికి అనుమతి లేనట్టే!!

హైదరాబాద్:
ఉస్మానియా క్యాంపస్ లోని ఆర్ట్స్ కాలేజీ దగ్గర విద్యార్థులతో కాంగ్రెస్ అధ్యక్షుని భేటీకి టిపిసిసి ఏర్పాట్లు చేస్తోంది. అయితే శాంతి భద్రతల దృష్ట్యా ఇలాంటి సమావేశం యూనివర్సిటీ క్యాంపస్ లో జరిపేందుకు పోలీసులు అనుమతి ఇవ్వడం ప్రశ్నార్థకంగా ఉన్నది. రాహుల్ గాంధీ సమావేశం ఏర్పాట్లపై ఓ.యూ గెస్ట్ హౌస్ లో ఓ.యూ జే.ఏ. సి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు శనివారం సమీక్షించారు.