ఉస్మానియా విద్యార్థి అరెస్ట్. విడుదలకు వి.వి.డిమాండ్.

హైదరాబాద్:

తెలంగాణ విద్యార్ధి సంఘం అధ్యక్షుడు, తెలంగాణ విద్యార్ధి జె.ఏ.సి కన్వీనర్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధి కోట శ్రీనివాస్ ను ఆయన స్వగ్రామం పెద్దపల్లిలో పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈ ఘటనను విప్లవరచయిత వరవరరావు తీవ్రంగా ఖండించారు. శ్రీనివాస్ ను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.