ఎం.పి.సుమన్ ఇంట్లో జొరబడిన నలుగురి పై జూన్ 7 నే కేసు నమోదు.

హైదరాబాద్:
రెండు రోజులుగా ఎంపీ సుమన్ పై వైరల్ అవుతున్న వార్త కథనాలపై బంజరహిల్స్ పోలీసులు శనివారం స్పందించారు. జూన్ 7 న ఎంపీ పీ.ఎ సునీల్ కంప్లెయింట్ ఇచ్చారని ఏసీపీ కె.ఎస్.రావు తెలిపారు. నలుగురు వ్యక్తులు వచ్చి ఎంపీ సుమన్ ని కలవాలని కోరారని, ఎంపీ లేక పోవడంతో తన పై దుర్బసలాడారని… పిర్యాదు చేశారని ఆయన చెప్పారు. సునీల్ చేసిన పిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ తెలిపారు. ఆరు నెలల క్రితం విజేత, సంధ్య లపై మంచిర్యాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యాయని, నిందితులను రిమాండ్ కు పంపించామని అన్నారు. మంచిర్యాల జైలు నుంచి బయట కు వచ్చిన సంధ్య, విజేత తో పాటు మరో ఇద్దరు యువకులు ఎంపీ ఇంటి పై కి వచ్చి దౌర్జన్యం చేశారని ఏసీపీ చెప్పారు.
పిఎ సునీల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు… కేసు దర్యాప్తు కొనసాగుతుందని ఆయన వివరించారు.