ఎన్నికలొస్తున్నాయ్ అప్రమత్తంగా ఉండాలి -కేటీఆర్.

హైదరాబాద్:
ఇప్పటికే ఎన్నికల వాతావరణం వచ్చేసినందున పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కేటీఆర్ పిలుపు నిచ్చారు. కాంగ్రెస్ నేతలు.. 60 ఏళ్ళు అధికారం లో ఉన్నపుడు అభివృద్ది చేసి వుంటే ఇంకా మన దేశంలో వేల గ్రామాలకు కరెంట్ దిక్కు లేదు. రోడ్లు లేవు. లక్షల, కోట్ల మందికి సౌకర్యాలు ఎందుకు లేవన్నారు.
కాంగ్రెస్ తెలంగాణ కు చేసిన ద్రోహం అంతా ఇంతా కాదని కేటీఆర్ విమర్శించారు. ఒకప్పుడు ఆంధ్ర, తెలంగాణ కు బలవంతపు పెళ్లి చేసింది కాంగ్రెస్ పార్టీయే నన్నారు.
తెలంగాణ అమ్మ ఇచ్చిందని కాంగ్రెస్ వాళ్ళు చెబితే ఎవ్వరియ్యలే మేమే గుంజుకున్నం అని పోయిన ఎన్నికల్లో వాళ్ళను ఓడించారని మంత్రి గుర్తు చేశారు.”జనాలను చైతన్యం చేస్తారట బిజేపి వాళ్ళు. ఇప్పటికే ప్రజలు చైతన్యంగ వున్నారు. ఈ సారి కూడా వీపులు పలగొడ్తరు” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కోటి ఏకరల మాగాణి అని కేసీఆర్ అంటున్నారని కేసీఆర్ తెలిపారు. ఇంటింటికీ నీళ్లు ఇచ్చామని, కాంగ్రెస్ వాళ్ళ కిందకు నీళ్ళు తెచ్చుడు కూడా పక్కా అని ఆయన అన్నారు. ఇంకో 15 ఏళ్ళు టీఆర్ఎస్ అధికారంలో వుంటుందన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా వుంటారని స్పష్టం చేశారు. ఎన్నికల కాలం వచ్చిందంటే గాలి మాటలు వినిపిస్తాయని, నోటికి ఏది వేస్తే అది మాట్లాడే నాయకులు వస్తరని చెప్పారు. అవసరం అయితే ఇంటికి తులం బంగారం కూడా ఇస్తారని విమర్శించారు.