న్యూ ఢిల్లీ.
దేశంలోని అగ్రగామి టెలికం సంస్థ భారతీ ఎయిర్టెల్ రికార్డులు బద్దలుగొడుతోంది. జమ్ముకశ్మీర్‌లో రికార్డు స్థాయిలో 50 లక్షల మంది ఖాతాదారులను సొంతం చేసుకుంది. ఇటీవల 83 శాతం మంది ఎయిర్‌సెల్ వినియోగదారులు నంబరు పోర్టు ద్వారా ఎయిర్‌టెల్‌కు మారారు. దీంతో ఆ సంస్థ వినియోగదారుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఈ సందర్భంగా ఎయిర్టెల్ అప్పర్ నార్త్ హబ్ సీఈవో మను సూద్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎయిర్టెల్ నెట్‌వర్క్‌ను పెంచడంతోపాటు హైస్పీడ్ డేటా సేవలను కూడా అందించనున్నట్టు తెలిపారు. 2019 ఆర్థిక సంవత్సరానికి గాను 11,400 మొబైల్ సైట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు పేర్కొన్నారు. తమకు సేవ చేసే అవకాశం కల్పించిన రాష్ట్రంలోని 50 లక్షలమంది ఖాతాదారులకు కృతజ్ఞతలు తెలపుకుంటున్నట్టు చెప్పారు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్‌లోనూ ఎయిర్టెల్ దూసుకుపోతోంది. ఆ రాష్ట్రంలో ఎయిర్టెల్ వినియోగదారుల సంఖ్య 35 లక్షలు దాటింది