ఎల్లుండి పాతబస్తీకి అమిత్ షా!!

Hyderabad:

కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ కు వస్తున్నారు. రెండోసారి బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అమిత్ షా హైదరాబాద్ కు రావడం ఇదే మొదటిసారి. హైదరాబాద్ లో 2019 లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా… కేంద్ర హోంశాఖ మంత్రి అయ్యాక.. తొలిసారిగా హైదరాబాద్ వస్తున్నారు. హైదరాబాద్ లో అధికారిక, పార్టీ వ్యవహారాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. పహాడీ షరీఫ్ లోని మామిడిపల్లిలో ఒక గిరిజన కుటుంబం ఇంట్లోకి వెళ్లి .. ఆ కుటుంబసభ్యులకు బీజేపీ పార్టీ సభ్యత్వం ఇవ్వనున్నారు అమిత్ షా.
ఈనెల ఆరో తేదీ శనివారం రోజున… అధికారిక కార్యక్రమాల తర్వాత… హైదరాబాద్ లో 20మంది బీజేపీ ముఖ్యనేతలతో అమిత్ షా సమావేశం అవుతారు. తెలంగాణలో బీజేపీని పటిష్టపరిచే చర్యలపై చర్చిస్తారు. మిషన్ ఆకర్ష్ పై సూచనలు చేస్తారు. అమిత్ షా టూర్ కన్ ఫామ్ కావడంతో.. ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు రాష్ట్ర బీజేపీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి.