ఎసిబి వలలో విద్యుత్ ఏ.ఇ.

నల్గొండ:
రూ.20వేలు లంచం తీసుకుంటూ వేములపల్లి విద్యుత్ ఏఈ అలుగుబెల్లి శ్రీధర్‌రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడ్డారు. శుక్రవారం ఉదయం శ్రీధర్‌రెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహించింది. ఆ సమయంలో శ్రీధర్‌రెడ్డి ఓ కాంట్రాక్టర్‌ నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. మిర్యాలగూడలోని శరణ్య హోమ్స్‌లోనే శ్రీధర్‌రెడ్డిని పట్టుకున్నారు. నగదు స్వాధీనం చేసుకున్న ఏసీబీ విచారణ చేపట్టింది.