ఏపీ డీజీపీ గా ఆర్పీ ఠాకూర్.

విజయవాడ:
ప్రస్తుతం ఏసీబీ డీజీ గా ఉన్న ఆర్పీ ఠాకూర్ ను ఏ.పీ. డిజీపీ గా నియమించారు. 1986 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఆర్.పి.ఠాకూర్. R P ఠాకూర్ పూర్తి పేరు రామ్ ప్రవేశ్ ఠాకూర్. 1961 జూలై 01 న జన్మించిన ఆర్. పి. ఠాకూర్. IIT కాన్పూర్ లో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ చదివిన ఠాకూర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రాంతాల్లో కీలక బాధ్యతలు నిర్వహించిన ఠాకూర్. 1986 డిసెంబర్ 15 న ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఠాకూర్. హైదరాబాద్ లోని జాతీయ పోలీసు అకాడమిలో అదనపు ఎస్పీగా తొలి నియామకం గుంటూరు, వరంగల్ జిల్లాల్లో ASP గా బాధ్యతలు నిర్వహించిన ఠాకూర్.పశ్చిమగోదావరి, కడప, కృష్ణా, వరంగల్ జిల్లాల ఎస్పీలుగా బాధ్యతలు నిర్వహణ. జోనల్ హైదరాబాద్ డీసీపీ గా, అనంతపురం, చిత్తూరు జిల్లాల డీఐజీగా బాధ్యతలు. పాట్నా లోని ఈస్ట్రన్ జోన్ హెడ్ క్వాటర్స్ (CISF) డీఐజీ గా బాధ్యతలు నిర్వహణ. ఐజీగా పదోన్నతి పొంది హైదరాబాద్ లోని డ్రగ్స్ అండ్ కాపీ రైట్స్ డీజీ గా బాధ్యతలు. ADG గా ఉమ్మడి రాష్ట్రంలో కంట్రోలర్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ అధిపతిగా బాధ్యతలు. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్ర విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీ, ADGP (లా అండ్ ఆర్డర్) గా బాధ్యతలు. 2016 నవంబర్ 19 నుంచి రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డీజీగా బాధ్యతల నిర్వహిస్తోన్న RP ఠాకూర్.
2003 లో ఇండియన్ పోలీసు మెడల్, 2004 లో ASSP మెడల్ సాధించిన ఆర్ పి ఠాకూర్. పోలీసు శాఖలో విశిష్ట సేవలకు గుర్తింపుగా 2011 లో భారత రాష్ట్ర పతి చేతుల మీదుగా మెడల్ పొందిన ఆర్. పి. ఠాకూర్.