ఏ జిల్లాలో చూసినా ఏమున్నది గర్వకారణం!! ‘కారు’ దిగని అసమ్మతి!! తిరుగుబాటు ‘కారు’మబ్బులు!!

‘కారు’ దిగని అసమ్మతి!!
తిరుగుబాటు ‘కారు’మబ్బులు!!

 

ఎస్.కె.జకీర్.

ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను’… అని’పోకిరి’ సినిమాలో హీరో మహేష్ బాబు హిట్ డైలాగు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే ఫార్ములా ను అనుసరిస్తున్నారు. ప్రకటిత 105 అసెంబ్లీ నియోజకవర్గాలలో పలు చోట్ల రెబెల్స్ కార్యకలాపాలు పుంజుకుంటున్నా ఆయన తన వైఖరిలో మార్పు లేదని తేల్చి చెబుతున్నారు. ” సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తామని ఇచ్చిన హామీని కేసీఆర్ నిలబెట్టుకున్నారు. 105 టికెట్లు ప్రకటించాం. స్థానిక పరిస్థితులు, ఇతర కారణాలతో 25 కు పైగా నియోజకవర్గాలలో అసమ్మతి ఉన్న మాట నిజమే. అభ్యర్థులను ప్రకటించి నెల రోజులు గడచిపోయాయి. అన్నీ సర్దుకుంటాయి. అభ్యర్థులను మార్చేది లేదు. రాష్ట్ర ప్రయోజనాల నేపథ్యంలో ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రావలసి ఉన్నది. పార్టీ అభ్యర్థుల విజయం కోసం అందరు కష్టపడాలి. విబేధాలు, అభిప్రాయ బేధాలు విడనాడాలి. కేసీఆర్ కోసం టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి” అని మంత్రి కేటీఆర్ అసమ్మతి నాయకులకు హితబోధ చేస్తున్నారు. కొందరికి ఎమ్మెల్సీ, కొందరికి ఇతర పదవులు ఇస్తామని ఆయన అసమ్మతి నేతలకు హామీ ఇస్తున్నారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కొన్ని చోట్ల అసమ్మతి చిచ్చు చల్లారడం లేదు. కొన్ని చోట్ల తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారు. తెలంగాణా రాష్ట్ర సమితికి చెందిన 30 మంది అభ్యర్థులకు అసమ్మతి ‘ముప్పు’ పొంచి ఉన్నది. తుంగతుర్తి లో ఎమ్మెల్యే గాదరి కిషోర్ కు మందుల సామేల్ మద్దతు ఇవ్వడం లేదు. హుజుర్ నగర్ లో ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. గత ఎన్నికల్లో పోటీ చేసిన శంకరమ్మ’ఇస్తే తనకు లేదా అప్పిరెడ్డి కి ‘ టికెట్టు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఆ సీటు కోసం ఎన్ఆర్ఐ లు శానంపూడిసైది రెడ్డి, అప్పి రెడ్డి ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. నాగర్జున్ సాగర్ లో నోముల నర్సింహయ్య, కోటి రెడ్డి వర్గాల మధ్య ‘సయోధ్య ‘ కుదిరినట్టు పార్టీ నాయకులంటున్నారు. నల్గోండ లో కంచర్ల భూపాల్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని దుబ్బాక నర్సింహరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. టిఆర్ఎస్ పార్టీ ‘సంక్షోభ పరిష్కర్త’ , మంత్రి కేటీఆర్దుబ్బాకను పిలిపించి మాట్లాడారు. దుబ్బాక మెత్త బడ్డారు. తనకు ఎమ్మెల్సీ పదవినివ్వడానికికేటీఆర్అంగీరించినట్టుదుబ్బాక కథనం. కోదాడ అభ్యర్థి ఖరారు కావాల్సి ఉన్నది. వెనేపల్లి చందర్ రావు, శశిధర్ రెడ్డిల మధ్య పోటీ నెలకొంది. మునుగోడు లో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి పై పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. అసమ్మతి నాయకుడు వైనంపల్లివెంకటేశ్వర్ రావును పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయినా అసమ్మతి చల్లారకపోగా ఇంకా ఆ జ్వాలలు ఎగసిపడుతున్నవి. మునుగోడు టికెట్టును ఆశించి భంగపడిన వారిలో గౌడ సామాజికవర్గానికి చెందిన, రాష్ట్ర జర్నలిస్టుల సంఘం నాయకుడు పల్లె రవి కూడా ఉన్నారు. ఆయన భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుంటున్నారు.ఖమ్మం జిల్లా వైరా లో టిఆర్ ఎస్ అభ్యర్థి మదన్ లాల్ కు వ్యతిరేకంగా ఆడియో క్యాసెట్లు పంపిణీ జరుగుతున్నవి. అసమ్మతి వాదులు ఒక పాటను తమ పార్టి అభ్యర్దికి వ్యతిరేకంగా రూపొందించి ప్రచారం చేస్తున్నారు.

మదన్ లాల్ కారణంగా వైరాలో టిఆర్ఎస్ ఓటమి తప్పదన్నది అసమ్మతి కార్యకర్తల వాదన. చేతులారాతెచ్చిపెట్టుకుంటోందని అసమ్మతి కార్యకలాపాలు ఊపందుకున్నవి. ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు జరుగుతున్నవి. సత్తుపల్లి టిఆర్ఎస్ అసెంబ్లీ సీటు ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మెన్పిడమర్తి రవికి ఇచ్చారు. ఆ పార్టీలో అసమ్మతి రేగింది. మట్టా దయానంద్ కు టికెట్‌ కేటాయించాలని సుమారు 7 నుండి 8 వేల వాహనాలతో తల్లాడ నుండి కల్లూరు, విఎంబంజర మీదుగా సత్తుపల్లి వరకు ఆ పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. మట్టా దయానంద్ గత ఎన్నికలలో వైఎస్సార్ సిపి నుండి పోటీ చేసి 2000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఖమ్మం ఎంపిపొంగులేటి శ్రీనివాసరెడ్డికి అనుచరుడు. పొంగులేటితో పాటే టిఆర్ఎస్ లో చేరారు. దయానంద్ కుటుంబం‌ వైద్యసేవలతో సత్తుపల్లి చుట్టుపక్కల గ్రామాలలో మంచి పేరు ఉంది. బి ఫామ్ మార్పు జరగకపోతే వేరే పార్టీ నుండి లేదా ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని మట్టా ప్రయత్నిస్తున్నారు. స్టేషన్ ఘనపూర్ లో డాక్టర్ రాజయ్య అభ్యర్థిత్వంపై వ్యతిరేకత సెగలు ప్రగతిభవన్ ను కూడా తాకినవి. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, రాజారం ప్రతాప్ తదితరులు ఈ సీటు కోరారు. తన కూతురు డాక్టర్ కావ్యకు టికెట్టు ఇప్పించాలని కడియం చేసిన ప్రయత్నాలు నెరవేరలేదు. కడియం, రాజయ్యలను మంత్రి కేటీఆర్ హైదరాబాద్ పిలిపించి మాట్లాడారు. సయోధ్య కుదిర్చారు. కడియం శ్రీహరి తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారంటూ వార్తాకథనాలు వెలువడినవి.డాక్టర్ రాజయ్య అభ్యర్థిత్వాన్ని మార్చాలంటూ హన్మకొండ సర్క్యూట్ హౌజ్ దగ్గర దాదాపు పది వేల మంది కార్యకర్తలు ఆందోళనకు దిగడం, వారిని ఉప ముఖ్యమంత్రి కడియం నచ్చజెప్పి పంపడం… ఇదంతా పథకం ప్రకారమే జరిగిందన్న అనుమానాలు పార్టీ వర్గాల్లో ఉన్నవి. జనగామలోముత్తిరెడ్డియాదగిరిరెడ్డిని మార్చాలని కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. మానుకోట లో శంకర్ నాయక్ కు మాజీ ఎమ్మెల్యే కవితకు పొసగడం లేదు. కవిత, తదితర నాయకులను పిలిపించి మంత్రి కేటీఆర్ బుజ్జగించారు. పాలకుర్తి లో ఎర్రబెల్లి దయాకరరావుకు వర్సెస్ తక్కల్ల పల్లి రవీందర్ రావు నుంచి అసమ్మతి తలెత్తింది. భూపాల పల్లి లో మాజీ స్పీకర్ మధుసుధనచారికిగండ్ర సత్యనారాయణ రావు నుంచి భారీ ‘ముప్పు’ పొంచి ఉన్నది. గండ్ర కార్యక్రమాలు, సమావేశాలు, సభలు ముమ్మరం చేశారు. గండ్రకు ప్రజల్లో ఆదరణ కూడా కనిపిస్తున్నది.

 

తాను రెబెల్ గా బరిలోకి దిగనున్నట్టు గండ్ర సత్యనారాయణరావు ఇప్పటికే ప్రకటించారు. ములుగు లో మంత్రి చందులాల్ కు భీ ఫాం ఇస్తే ఓడిస్తామని తెలంగాణ ఉద్యమకారులు చెబుతున్నారు. డోర్నకల్ లో రెడ్యానాయక్ కు సత్యవతి రాథోడ్ మధ్య పొసగడం లేదు. గత ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన సత్యవతి రాథోడ్ కు ఈ సారి టికెట్టు ఇవ్వలేదు. అసమ్మతి చల్లార్చేందుకు కేటీఆర్ రెడ్యానాయక్, సత్యవతిని పిలిపించి చర్చలు జరిపారు. రామగుండం లో సోమారపు సత్యనారాయణకు ఓరుగంటి చందర్ రూపంలో అసమ్మతి ముప్పు కనిపిస్తున్నది. రెబెల్ గా పోటీ చేయడానికి చందర్ సన్నాహాలు చేస్తున్నారు. వేముల వాడ లో చెన్నమనేని రమేష్ కు కరీంనగర్ జడ్పి చైర్మన్ తుల ఉమ మద్దతు ఇవ్వడం లేదు. చెన్నమనేనికి సహకరించాలని టిఆర్ఎస్ హైకమాండ్ ఉమను కోరింది. ఈ సెగ్మెంటు నుంచి తులా ఉమటికెట్టు ఆశించి భంగపడ్డారు. చొప్పదండి తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ అభ్యర్థిత్వంపై సస్పెన్స్ కొనసాగుతున్నది. తనకే టికెట్టుఅని ఆమె ప్రచారం చేసుకుంటున్నారు. మరో వైపు టిఆర్ఎస్ ఎస్సీ సెల్ చైర్మన్ సుంకే రవీందర్ కూడా చొప్పదండిపై ఆశలు పెట్టుకున్నారు. సంగారెడ్డి లో చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ ఆర్. సత్యనారయణ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. సత్యనారాయణను కేటీఆర్ పిలిపించి మాట్లాడారు. ప్రభాకర్ కు మద్దతు ఇవ్వాలని కోరారు. నారాయణ ఖేడ్ లో భూపాల్ రెడ్డి అభ్యర్థిత్వంపై ఎమ్మెల్సీ రాములు నాయక్ చిందులు తొక్కుతున్నారు. తనకు టికెట్టు ఇవ్వకపోవడం పట్ల రాములునాయక్ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు కేటీఆర్ రంగంలోకి దిగారు. తిరుగుబాటు చేస్తున్న అభ్యర్ధులను బుజ్జగించేందుకు ఫోన్లు చేస్తున్నారు. చాలా మంది నేతలు దారికొస్తున్నారు.కానీ ఎమ్మెల్సీ రాములు నాయక్ మాత్రం కేటీఆర్పైనే ఫైర్ అయినట్టు సమాచారం అందుతున్నది. రాముల్ నాయక్ నారాయణఖేడ్ టికెట్ ఆశించారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే బూపాల్ రెడ్డికే టికెట్ ఇచ్చారు. దీంతో రాముల్ నాయక్ ఇండిపెండెంట్ గా బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. లంబడా సామాజిక వర్గ ప్రజలతో పాటు భూపాల్ రెడ్డి వ్యతిరేక వర్గంతో కలిసి నాయక్ ఆత్మియ సభను నిర్వహించారు. తనకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తు గ్రామాల్లో ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఆయన్ను బుజ్జగించేందుకు కేటీఆర్ ఫోన్ చేసారు. బరి నుంచి తప్పుకోవాలని సూచించారు. కాని ఆయన కేటీఆర్ మాట వినలేదు. ”మిమ్మల్ని నమ్ముకుంటే అమ్ముకున్నట్లే. అడుగడున నన్ను అవమానాలా పాల్జేస్తున్నారు. 2009 లో ఆదిలాబాద్ ఎంపి గా పోటి చేయాల్సి ఉంటుందని అంటే మహబూబ్ నగర్ కు చెందిన నేను ఆదిలాబాద్ కు వెళ్లాను. కేసీఆర్ నన్ను అక్కడికి పంపారు. ఉన్న ఊరిలో ఇల్లు అమ్ముకున్నా. రెండు సంవత్సరాలు ఆదిలాబాద్ లో పని చేశా

.

చివరికి టీడీపీ తో పొత్తు పెట్టుకుని నాకు టికెట్ రాకుండా చేసారు. 2014 లో కూడా ఇలాగే చేసారు .ఇప్పుడు మరో సారి అన్యాయం చేశారు . ఇప్పుడైతేఊరుకునేది లేదు. భూపాలరెడ్డికి బదులుగా నాకు నారాయణఖేడ్ టికెట్ ఇవ్వకపోతే లంబడాల సత్తా చాటుతా. ఎస్టీ రిజర్వేషన్లు పెంచకుండా అన్యాయం చేసారనే విషయాన్ని గ్రామా గ్రామానా చాటుతా. 2009 లో జోగినిపల్లి సంతోష్ అన్యాయం చేశాడు.ఇప్పుడు మీరు అన్యాయం చేస్తున్నారు” అని రాములు నాయక్ కేటీఆర్ పై ఫైర్ అయినట్టు పార్టీ వర్గాలలో ప్రచారం సాగుతున్నది. పటాన్ చెరు లో గుడెం మహిపాల్ రెడ్డికి టికెట్టు ఆశించి భంగపడిన గాలి అనిల్ కుమార్ అసమ్మతి జెండా ఎగురవేశారు.

మెడ్చెల్ అసెంబ్లీ అభ్యర్థి ఖరారు కాలేదు. ఎం పీ మల్లా రెడ్డి కి, సింగిరెడ్డిహరివర్ధన్ రెడ్డి, సుధీర్ రెడ్డిల మధ్య తగాదాలున్నవి. రాజేంద్ర నగర్ లో ప్రకాశ్ గౌడ్ కు శ్రీశేలం రెడ్డికి మధ్య పొసగడం లేదు. మల్కాజి గిరిలో మైనంపల్లి హనుమంతరావు కు, కనకా రెడ్డి బంధువులకు మధ్య గ్రూపు తగాదాలున్నవి. శేరిలింగంపల్లి లో అరికెపుడి గాంధి, జగదీష్ గౌడ్ , శంకర్ గౌడ్ , ఇతర కార్పోరేటర్ల మధ్య గొడవలు సాగుతున్నవి. కూకట్ పల్లి లో మాదవరంక్రుష్ణా రావు, పన్నాల హరీష్ , గొట్టి ముక్కుల పద్మారావుల మధ్య విబేధాలు కొనసాగుతున్నవి. జుబ్లిహిల్స్మా లో గంటిగోపినాథ్, పార్టీ ఇంచార్జ్ మురళి గౌడ్ ల మధ్య గొడవలు ఉన్నవి. ఖైరతాబాద్ లో మాజీ మంత్రి దానం నాగేందర్, మన్నే గోవర్ధన్ రెడ్డి, విజయారెడ్డి ల మధ్య పొసగడం లేదు. కుతుబుల్లా పూర్ లో వివేకానంద, కొలను హనుమంతరెడ్డిల మధ్య పొసగడం లేదు. షాద్ నగర్ లో అంజయ్య యాదవ్ అభ్యర్థిత్వాన్ని అండ్ బాబయ్య, వీర్ల పల్లి శంకర్ తీవ్రంగా వ్యతిరేకించారు. కేటీఆర్ కృషి ఫలించి బాబయ్య శాంతించినా వీర్లపల్లి శంకర్ మాత్రం ఇంకా బుస కొడుతూనే ఉన్నారు. ”ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా అంతిమ విజయం మనదే. ఇచ్చిన మాటకు కట్టు బడుతా.మాట తప్పను మడమ తిప్పను. నా వెనుక ప్రజలు , కార్యకర్తలు ఉన్నారు. ఎవరిపైనా నేను ఆధార పడాల్సిన అవసరం లేదు. రాబోయే రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి.అభిమానులునాపై విశ్వాసంతో ఉన్నారు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లనుచవి చూశా. నా లక్ష్యానికి ఎవరు అడ్డుపడలేరు. ఎందరుఅడ్డొచ్చినా గమ్యం చేరడం ఖాయం” అనివీర్లపల్లి శంకర్ ఒక సమావేశంలో అన్నారు.