ఒకేరోజు నలుగురు జర్నలిస్ట్ ల మృతి. జర్నలిస్ట్ సంఘాల సంతాపం.

హైదరాబాద్:
మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ప్రకటన:
“ఒకే రోజు నలుగురు కలం సైనికులు మృతి చెందడం నన్ను కలచివెసింది, తెలంగాణ సాధనలో నాతోపాటు నడిచిన నలుగురు మిత్రులు నేడు గుండెపోటుతో మృతి చెందడం జర్నలిష్టు లోకానికి తీరని లోటు, కరీంనగర్ జిల్లాలో విజయక్రాంతి పత్రికలో బ్యూరోచీప్ గా విధులు నిర్వహిస్తున్న ఇనుగర్తి అశోక్ మరణం
చాలా బాధాకరమైన విషయం. ఉమ్మడి మెదక్ జిల్లాలో నేడు దుబ్బాక మన తెలంగాణ రిపోర్టర్ వెంకటస్వామి,చిన్నశంఖరంపేట NTV రిపోర్టర్ సిద్దిరాములు, టేక్మాల్ మాజీ అంధ్రప్రభ రిపోర్టర్ శ్రీనివాస్, ముగ్గురు మిత్రులు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోవడం ధ్రిగ్బంతిని కల్గించింది.
వారికుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మ కు శాంతి చేకూరాలని…. మీడియా అకాడమీ పరంగా అన్ని విదాల ఆదుకుంటాం. ఎక్స్ గ్రేషియా ఇవ్వడంతో పాటు ఆ కుటుంబానికి అండగా ఉంటాం”.