ఒక సీటు. ఇద్దరు అభ్యర్థులు. స్టేషన్ ఘనపూర్ రాజకీయం.

వరంగల్:
స్టేషన్ ఘన్ పూర్ రాజకీయం ట్విస్ట్ ల మీద మీద ట్విస్టులతో సాగుతోంది.. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో అధికార టీఆర్ఎస్ టికెట్ ఎవరికి దక్కుతున్నదే ఇక్కడి చిక్కుముడి. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య స్టేషన్ ఘన్ పూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. ఆయన పాత టీఆర్ఎస్ నాయకుడిగా ఉన్నారు. తాజా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కూడా ఇదే అసెంబ్లీ సెగ్మెంట్ లో పలుమార్లు గెలుపొందారు..  ప్రజల్లో మంచి పట్టు సంపాదించారు. నాటకీయ పరిణామాల మధ్య డిప్యూటీ సీఎం పదవి కోల్పోయిన రాజయ్య ఎమ్మెల్యేగా కొనసాగుతుండగా, ఎంపి పదవికి రాజీనామా చేయించిఎమ్మెల్సీ గా ప్రమోట్ చేసి డిప్యూటీ సీఎం గా కడియం ను నియమించారు సీఎం.
ఇక కనిపించని మూడో అభ్యర్థి కూడా ఘన పూర్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కరుణిస్తాడని గంపెడాశ తో ఉన్నారు. ఆయనే రాజారపు ప్రతాప్.. గతంలో కాంగ్రెస్ అభ్యర్థి గా స్టేషన్ ఘన్ పూర్ ఓడిపోయి, తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. ఓ నామినేటెడ్ పదవిని కూడా కేసీఆర్ , ప్రతాప్ కు అప్పగించారు.. ప్రస్తుతం మరోసారి టికెట్ దక్కితే సత్తా చాటాలని ప్రతాప్ సన్నిహితులతో అంటున్నట్టు సమాచారం. ఉద్యమకాలంలో టీఆర్ఎస్ లో చేరిన రాజయ్య అక్కడ గులాబీ పార్టీ తరపున ఉప, సాధారణ ఎన్నికలలో గెలిచిన అనుభవం ఉన్నది..  పైగా సిట్టింగు ఎమ్మెల్యే కూడా. కేసీఆర్ వాగ్దానం ప్రకారం సిట్టింగులకు అందరికీ సీట్లు వస్తే రాజయ్య కు ఢోకా ఉండకపోవచ్చు..!! కానీ పరిస్థితి ఇందుకు భిన్నంగా తయారైంది…. రేసులో కడియం , రాజీరపు ప్రతాప్ కూడా ఉండటంతో మూడు ముక్కల ఆటను తలపిస్తుంది ఇక్కడి రాజకీయం. గురువారం నాడు స్టేషన్ ఘన్పూర్ లో పర్యటించిన కడియం పసి ఆసక్తికర, నర్మగర్బ వ్యాఖ్యలు చేశారు.. తన రాజకీయ చతురతను రంగరించి చిన్న పాటు ఎన్నికల ప్రసంగం చేశారు..। ఘన పూర్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం వల్లే కడియం శ్రీహరి నేడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడని. ఈ నియోజక వర్గ ప్రజల రుణాన్ని ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేను ’’ అని ఉప ముఖమంత్రి కడియం శ్రీహర చెప్పుకొచ్చారు. పనిలో పనిగా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్యకు, నాకు ఎలాంటి అభిప్రాయ బేధాలు లేవని, కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. ఏ అవకాశమైన పార్టీ ఇస్తుందని, ముఖ్యమంత్రి కేసిఆర్ ఇస్తారని దాని ప్రకారమే పనిచేస్తామని చెప్పడం ఆసక్తిరేపుతుంది. ఆయన అసెంబ్లీ బరిలో ఉంచారని జరిగే ప్రచారానికి బలం లబించింది. స్టేషన్ ఘన్పూర్ ప్రజల నాయకుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఇక్కడి ప్రజలు తలఎత్తుకునే విధంగానే ఇప్పటి వరకు తాను వ్యవహరించానని, ఈ నియోజక వర్గ ప్రజలు తలదించుకునే తప్పు పని కడయం శ్రీహరి ఇప్పటి వరకు చేయలేదని, ఇక కూడా చేయడని హామీ ఇచ్చారు. తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టేలా పనిచేస్తానని చెప్పడం నియోజకవర్గంలో మరో రకమైన చర్చ కు దారి తీసింది. గతంలో తాను చేసిన పనులు ఎకరువుపెటిటిన కడియం కొత్త హామీలు, తన లక్ష్యాలను ప్రజల ముందు ఉంచారు..
తాటికొండ, మీదికొండ, కొత్తపల్లి గ్రామాలలో 4,5వేల ఎకరాలకు నీరందించి సస్యశ్యామలం చేసే కృషి చేస్తానని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. అదేవిధంగా స్టేషన్ ఘన్పూర్ నుంచి నర్మెట వరకు డబుల్ రోడ్డు చేయిస్తానని చెప్పారు.ఇదంత చూస్తున్న జనం ఈసారి స్టేషన్ ఒమన పూర్ టికెట్ కడియం దక్కొచిచని చెవులు కొరుక్కోవడం కొసమెరుపు…