కఠినచట్టాలతో సంస్కృతి వ్యతిరేకులకు చెక్. – స్వామి పరిపూర్ణానంద.

విజయవాడ:
ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మను పరిపూర్ణానంద స్వామి దర్శించుకున్నారు. పరిపూర్ణానంద స్వామికి ఆలయ మర్యాదలతో దుర్గగుడి అధికారులు స్వాగతం పలికారు. సంస్క్రుతి పై వ్యాఖ్యానాలు చేయడం వ్యక్తుల లోఫం కాదు వ్యవస్ధలో లొపం అని స్వామి అన్నారు.
విద్యా వ్యవస్ధలో చరిత్ర ను నెర్పించకపోవడం ప్రభుత్వాల లోపమేనన్నారు. పిల్లలు టెక్నికల్ గా ఎదుగుతున్నారు కాని భారతీయ సంస్క్రుతి పట్ల అవగాహన లేకుండా పోతోందన్నారు. విద్యావ్యవస్ధలో రాముడు చరిత్రకు మూల కారణమని చెప్పాలి.. అఫ్పుడే వివాదాలుండవని స్వామి చెప్పారు. హిందూ సంస్క్రుతి నేర్పింది ఎవరెన్ని వివాదాలు చేసినా పశ్చాత్తాప పడితే అక్కున చెర్చుకోవాలని తెలిపారు. కత్తి మహేష్ చెసిన పొరపాటు తెలుసుకుని శ్లోకం పాడారని స్వామి చెప్పారు.
కత్తి మహేష్ తప్పు తెలుసుకొనే సమయం ఆసన్నమైందని చెప్పారు. కత్తి మహెష్ మంచి బవిష్యత్ పొందాలంటే రామ నారాయణ జపం చేయాలని కోరారు. కఠిన చట్టాలు ప్రభుత్వాలు తీసుకువస్తే ఇటివంటి వివాదాలు ఉండవని పరిపూర్ణానంద అన్నారు. ఎవరి మత విస్వాసాలు వారు ఆచరిచాలంటే ప్రబుత్వం కఠిన చట్టం తేవాలని ఆయన సూచించారు.