కత్తి చిత్తూరు – స్వామి కాకినాడ.

హైదరాబాద్:
అనుకున్నట్టే జరిగింది. హైదరాబాద్ లో శాంతి భద్రతలకు ముప్పు కలిగే ప్రమాదం ఉన్నందున అటు కత్తి మహేశ్ ను, ఇటు స్వామి ని నగరం నుంచి బహిష్కరించారు. ముందుగా కత్తిని ఆయన స్వస్థలం చిత్తూరు కు తరలించారు. బుధవారం తెల్లవారుజామున స్వామిని కాకినాడ కు పంపారు.
పరిపూర్ణానంద స్వామి పై ఆరు నెలల పాటు నగరం నుంచి హైదరాబాద్ పోలీసులు బహిష్కరించారు. పోలీసులకు తెలియకుండా పోలీసుల అనుమతి లేకుండా హైదరాబాద్ రావొద్దని ఆదేశం. ఈవాళ ఉదయం పరిపూర్ణానంద స్వామి ని ఆరు నెలలు నగర బహిష్కరణ చేసిన పోలీస్ లు. స్వామిజీ ని అదుపులోకి తీసుకుని కాకినాడ వెళ్ళిన పోలీసులు.