కత్తి మహేష్ పై కేసు నమోదు.

హైదరాబాద్:
టాలీవుడ్ క్రిటిక్ కత్తి మషేష్ పై హైదరాబాద్ కేపీహెచ్ బీ కాలనీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. హిందువులు భక్తిభావాలతో కొలుచుకునే రాముడిని దుర్భాషలాడారంటూ పోలీసులకు హిందూ జనశక్తి నేతలు ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలను గాయపరిచిన కత్తి మహేష్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఈ నేపథ్యంలో, కత్తి మహేష్ పై కేసు నమోదైంది. ఇటీవల ఓ న్యూస్ ఛానల్ లో చరిగిన చర్చా కార్యక్రమంలో కత్తి మహేష్ మాట్లాడుతూ, రామాయణం అనేది ఒక కథ అని చెప్పాడు. రాముడనే వ్యక్తి ఎంత ఆదర్శవంతుడో, అంత దగుల్బాజీ అని కూడా తాను నమ్ముతానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. రావణుడితోనే సీత ఉంటే బాగుండేదేమోనని… ఆమెకు న్యాయం జరిగి ఉండేదేమో అని తాను భావిస్తున్నానని చెప్పాడు. ఈ వ్యాఖ్యలపై హిందూ జనశక్తి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.