కరీంనగర్ లో ల్యాండ్ మాఫియా. 10 మంది రెవెన్యూ అధికారులపై చార్జిషీటు.

కరీంనగర్ నగరం విస్తరిస్తుండటం, పైగా ‘స్మార్ట్‌సిటీ’గాఅవతరిస్తుండటంతోకరీంనగర్పరిసరప్రాంతాల భూములకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈనేపధ్యంలో ఈ భూములపై కన్నేసిన అక్రమార్కులు ప్రభుత్వ లావుణీపట్టా భూమిని ప్రైవేట్‌ ల్యాండ్‌గా నకిలీ పత్రాలు సృష్టించి, దురాక్రమణకు పాల్పడి,ఏకంగా విక్రయానికి కూడా పెట్టేశారు. ప్రస్తుతం మార్కెట్‌ విలువ ప్రకారం ఇక్కడి సర్వేనంబర్లలోని ప్రభుత్వ భూమి విలువవందకోట్ల రూపాయలకు పైబడే ఉంటుంది. అయితే 12 ఏళ్ల కింద సీఐడీ విచారణకు ఆదేశించినా, నత్తను కూడా తలదన్నేలా సీబీసీఐడీ అధికారులు వ్యవహరించారు. ఈ మొత్తం భూకబ్జాల వ్యవహారంలో సుమారు 20మందికిపైగా రెవెన్యూ యంత్రాగం, ఇతర ప్రైవేట్‌ వ్యక్తులున్నట్టు తెలుస్తున్నది. ఓ పదిమంది రెవెన్యూ అధికారులపై తాజాగాసిఐడి అధికారులు ఛార్జ్‌షీట్‌ ఫైల్‌ చేయడంతోరేకుర్తిలోని ప్రభుత్వ, పట్టా, ఇనాం భూముల కబ్జా దందాలన్నీబట్టబయలయ్యాయి.

హైదరాబాద్;
కరీంనగర్జిల్లాలో భూ కుంభకోణం బద్దలైంది. పది మంది రెవెన్యూఅధికారులు,సిబ్బంది సహా భూ ఆక్రమణలకు పాల్పడిన వ్యక్తులపై సిఐడిచార్జిషీటు దాఖలుచేసింది. పట్టాభూమా,లావణీ పట్టానా, ప్రభుత్వభూమాఅన్నదిభూబకాసురులకు అవసరం లేదు.  ఎక్కడికక్కడ, విచ్చలవిడిగా‘భూబాగోతం’సాగించారు. భూదాహంతో పేదల పట్టా భూములు చాలాకాలంగా  కబ్జాకు గురయ్యాయన్న  ఆరోపణలు వెల్లువెత్తుతుండగా, మరో36 ఎకరాల ప్రభుత్వభూమిని సైతం అడ్డగోలుగా ఆక్రమించుకున్నారు. అందుకు  రెవెన్యూ సిబ్బంది సహకరించడమేప్రధాన కారణం.  పదిమంది రెవెన్యూ సిబ్బందితో పాటు,దురాక్రమణలకు పాల్పడ్డవారిపై  సీఐడీ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయడంతో కుంభకోణంతాజాగావెలుగుచూసింది. కరీంనగర్‌ నగర శివారులో‘భూమాఫియా’వ్యవహారంచాలా సంవత్సరాలుగా సాగుతున్నది. పిల్లికొండగట్టు స్వామి అనే వ్యక్తి  పోరాటంతో కరీంనగర్‌ నగర శివార్లలో పెద్దఎత్తున జరుగుతున్న భూకుంభకోణం బట్టబయలైంది. ప్రభుత్వ భూములు, భూస్వాముల సీలింగ్‌ భూములు, పట్టేదారులపట్టాభూముల వ్యవహారాలన్నీ బట్టబయలయ్యాయి. పీకేజీస్వామి కూడా ఓ బాధితుడు కావడంతో ఆయన ఈ పోరాటం చేబట్టారు. స్వామికి చెందిన 186/B సర్వే నంబర్‌లోని 17 ఎకరాల ఇనాం భూమిని స్వర్గీయ షేఖాన్‌, శేఖ్‌సాలే అనే అరబ్‌ కుటుంబీకులు కబ్జా చేశారనిపీకేజీ స్వామి, ఆయన కుటుంబసభ్యులు  ఆరోపిస్తున్నారు. పీకేజీ స్వామి తండ్రి రేకుర్తి సుంకరిగా పనిచేశారు. ఈయన అన్నయ్య కూడా తనదనంతరం సుంకరిగా పనిచేశారు. ఈక్రమంలో వీరికి నిజాంకాలంలో17 ఎకరాల భూమిని ఇనాం కింద ఇచ్చారు. 1993 వరకు కూడా వీరిపేరిటనేపహాణీల్లోఉన్నాయి. ఆతర్వాత రికార్డులు తారుమారయ్యాయి. పైసలపట్టీ లేకుండానే,పహాణీల్లో పేర్లు మారడం,పట్టాదారుపాసుపుస్తకాలు కూడా మారిపోయినవి. భూకబ్జాదారుల పేర్లు ప్రత్యక్షమయ్యాయి. ఆ భూములను కబ్జా చేసిన షేఖాన్‌, షేక్‌సాలేల  వారసుడైన అబూబాకర్‌ కుటుంబ సభ్యులు కూడా అదే అరాచకాన్ని తమపై కొనసాగిస్తున్నారని పీకేజీ స్వామి కుటుంబసభ్యులుఅంటున్నారు.ఎమ్మార్వో, కలెక్టర్‌ ల నుంచి గతంలోముఖ్యమంత్రి చంద్రబాబు,వై.ఎస్.రాజశేఖర రెడ్డి,ప్రస్తుత సీఎం కేసీఆర్ వరకూ పీకేజీ స్వామి లేఖలఉద్యమాన్ని సాగిస్తున్నారు. 1992 నుంచి స్వామి పోరాటం కొనసాగిస్తున్నాడు.  నాటి ఎమ్మార్వో చంద్రమోహన్‌ ఈ మొత్తం భూకబ్జాల వ్యవహారంలో అక్రమార్కులకు సహకరించారని స్వామి ఆరోపిస్తున్నారు. సీఐడీ ఛార్జ్‌షీట్‌ చంద్రమోహన్ పై  కూడా దాఖలైనట్టు తెలుస్తోంది. కబ్జాదారులు ఆయా భూములను పడావు భూములుగా చూపిస్తూ ప్రభుత్వానికి శిస్తూ కూడా  కట్టలేదని తెలుస్తున్నది. గతంలోన్యాయస్థానం ఆదేశాలతో  విచారణ చేపట్టిన కలెక్టర్‌, రెవెన్యూ సిబ్బంది తప్పుచేశారని తేల్చేశారు. అప్పటి కలెక్టర్‌ సుమితాదావ్రాహయాంలోఅన్యాక్రాంతమైన పట్టాభూములపై  సమగ్ర విచారణ జరిగింది.భూబకాసురులు కబ్జా చేసిన 206 ఎకరాల భూమిని తిరిగి పట్టాచేయాలని2003 అక్టోబర్‌ 24 న వచ్చిన  హైకోర్ట్ తీర్పుఇచ్చింది.

ఇప్పటివరకూ కదలిక లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయినా అమలు కాని పరిస్థితి. కబ్జాదారులతో చేతులు కలిపిన పలువురు కరీంనగర్‌, హైదరాబాద్‌కు చెందిన న్యాయవాదులు పీకేజీ స్వామితో పాటు, మరో ఏడు కుటుంబాలను మోసం చేశారని తెలుస్తున్నది. కరీంనగర్‌ శివార్లలోని విలువైన తమ రేకుర్తి భూములకు సంబంధించిపీకేజీ స్వామి పోరాటం చేస్తున్నాడు. మరో ఏడు కుటుంబాలదీ ఇదే కథ. స్వర్గీయ రహమతున్నీసా బేగంకు చెందిన 41, 42, 51, 53, 54, 222, 223 సర్వే నంబర్లలోని12 ఎకరాల భూమిని షేకాన్, షేక్‌సాలేలు దురాక్రమణ చేసి తమ బినామీల పేరిట పట్టా చేయించుకున్నారని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి.చిందంభూమమయ్య, చిందం చిన్న భూమయ్య, చిందంగట్టయ్యలకు చెందిన 20, 50, 216, 45 సర్వే నంబర్లలోని15 ఎకరాల 15 గుంటల భూమిని కొందరు‘భూబకాసురులు’ కబ్జా చేసేశారు.  స్వర్గీయ బత్తినివెంకటేశ్‌గౌడ్‌కు చెందిన 44 సర్వే నంబర్‌లోని 38 గుంటల భూమి, అబ్ధుల్‌ సయీద్‌ఖాన్‌కు చెందిన 18, 25, 26, 27, 58, 184, సర్వేనంబర్లతోపాటు,సర్వేనంబర్‌ 194పెద్దగుట్టను కూడా వదలకుండా 106 ఎకరాలను కబ్జారాయుళ్లు స్వాహా చేశారు. మల్కాపురంరాజేశ్వరీకి చెందిన 12, 13, 14, 191, 222 సర్వే నంబర్లలోని24 ఎకరాల 16 గుంటల భూమినీ, దుర్గం రాజయ్యకు చెందిన 159, 160 సర్వే నంబర్లలోని భూములనూ,  కొత్తపల్లికి చెందిన శ్యామకూరి భూమయ్యకు చెందిన 5 ఎకరాలుఇలా  మొత్తం206 ఎకరాల పట్టాభూములు  కబ్జాకుగురయ్యాయని తెలుస్తున్నది.నేదునూరి కిషన్‌రావు, ఆయన సోదరులకు సంబంధించిన భూములనుకూడా కబ్జా చేశారు.   దాదాపు తమ 20 కుటుంబాలు  రోడ్డున పడి అధికారులు చుట్టూ తిరుగుతున్నా, ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నాలాభంలేదని వాపోతున్నారు. కొత్తపల్లి మండలం రేకుర్తిలోనిసర్వేనంబర్‌ 165, 166, 167, 168లలో36 ఎకరాల 1 గుంట భూమి ఉండగా, భూయజమాని మృతిచెందడంతో యజమానులెవ్వరూ లేని భూమిగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. రోజురోజుకూ కరీంనగర్ నగరం విస్తరిస్తుండటం, పైగా ‘స్మార్ట్‌సిటీ’గాఅవతరిస్తుండటంతోకరీంనగర్పరిసరప్రాంతాల భూములకు  విపరీతమైన డిమాండ్  ఏర్పడింది. ఈనేపధ్యంలో ఈ భూములపై కన్నేసిన అక్రమార్కులు ప్రభుత్వ లావుణీపట్టా భూమిని ప్రైవేట్‌ ల్యాండ్‌గా నకిలీ పత్రాలు సృష్టించి, దురాక్రమణకు పాల్పడి,ఏకంగా విక్రయానికి కూడా పెట్టేశారు. ప్రస్తుతం మార్కెట్‌ విలువ ప్రకారం ఇక్కడి సర్వేనంబర్లలోని ప్రభుత్వ భూమి విలువువందకోట్ల రూపాయలకు పైబడే ఉంటుంది. అయితే 12 ఏళ్ల కింద సీఐడీ విచారణకు ఆదేశించినా, నత్తను కూడా తలదన్నేలా సీబీసీఐడీ అధికారులు వ్యవహరించారు. ఈ మొత్తం భూకబ్జాల వ్యవహారంలో సుమారు 20మందికిపైగా రెవెన్యూ యంత్రాగం, ఇతర ప్రైవేట్‌ వ్యక్తులున్నట్టు తెలుస్తున్నది. ఓ పదిమంది రెవెన్యూ అధికారులపై తాజాగాసిఐడి అధికారులు  ఛార్జ్‌షీట్‌ ఫైల్‌ చేయడంతోరేకుర్తిలోని ప్రభుత్వ, పట్టా, ఇనాం భూముల కబ్జా దందాలన్నీబట్టబయలయ్యాయి. కబ్జాదారులు ఆక్రమించిన ప్రభుత్వ భూముల్లో పాతిన ఖణీలుపీకేయించామనిఅధికారులు చెప్పారు. ఇక పట్టాదారుల భూములకు సంబంధించి సీలింగ్‌ యాక్ట్‌ కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూములు కాబట్టి,తెలంగాణా ప్రభుత్వం నూతనంగా జారీచేసిన పట్టాదారు పాసు పుస్తకాలను కూడా వారికి జారీ చేయలేదు. వాటిని వివాదాస్పద భూములుగా పార్ట్‌ ‘బీ’ కింద పెట్టినట్టు తెలిపారు. అయితే భూబకాసురులు పాతిన హద్దురాళ్లను ఇంకా కూడా కొన్ని చోట్ల తొలగించలేదు. కరీంనగర్‌ శివార్లలోని కొత్తపల్లి, రేకుర్తి, ఎల్గందుల, సీతారాంపూర్, ఆరెపల్లి, చింతకుంటతదితర ప్రాంతాల్లో  విచారణ చేపడితే ఈ ‘భూబకాసురుల’కు చెందిన చాలా  కథలు వెలుగులోకి రావచ్చు. తెలంగాణా రాష్ట్రంలోనే ఓ పెద్దభూకుంభకోణంబట్టబయలయ్యేఅవకాశాలున్నవి.