కవితతో ఆస్ట్రేలియా హై కమిషనర్ భేటీ.

హైదరాబాద్:
ఇండియాలో ఆస్ట్రేలియా హైకమిషనర్ హరిందర్ సిధు, చెన్నై ఆస్ట్రేలియన్ కాన్సుల్ జనరల్ సుసాన్ గ్రేస్ నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ను కలిశారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని ఎంపి కవిత నివాసంలో వారు ఎంపిని కలిశారు. భారత- ఆస్ట్రేలియా దేశాల మధ్య ఆర్థికాభివృద్ధికి సంబంధించిన అంశాలను వివరిస్తూ విద్య, ఉద్యోగ, వ్యాపార అవకాశాలు, ఒప్పందాలను ఎంపి కవితకు వివరించారు. భారత దేశంతో తమ దేశానికి మధ్య ఉన్న సత్సంంధాలను తెలిపారు. మీ సహకారం పూర్వంలాగె అందించాలని ఎంపి కవిత ను వారు కోరారు. ఆస్ట్రేలియా హైకమిషనర్ హరిందర్ సిధుకు ఎంపి కవిత బతుకమ్మ జ్ఞాపికను బహూకరించారు. సమావేశం లో బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆమిర్, జగిత్యాల నియోజకవర్గం టిఆర్ఎస్ ఇంచార్జీ డాక్టర్ సంజయ్ కుమార్ లు ఉన్నారు.