కవులపై ఉగ్రవాద చట్టం కింద కేసు.

విజయవాడ:
గొప్ప భావుకుడు,విప్లవ కవిగా పరిచయమున్న అరసవిల్లి కృష్ణతో పాటు, విరసం కవి మేడక యుగంధర్, మరో సభ్యుడు పెద్ది కృష్ణ, ప్రగతిశీల కార్మిక సంఘం నాయకుడు కొండారెడ్డిలకు
తూర్పుగోదావరి జిల్లా చింతూరు పోలీసుల నుండి నోటీసులు అందాయి. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద ఈ నలుగురూ సబ్ డివిజనల్ పోలీసాఫీసర్ ఎదుట 15 రోజుల్లో హాజరు కావాలని ఆదేశించారు.
కవిత్వం కూడా తీవ్రవాదమేననడం, చట్టం ప్రజల తరపున మాట్లాడితే జూలు విదిలిస్తున్నదని విరసం తీవ్ర నిరసన తెలిపింది.ప్రజాస్వామికవాదులందరూ ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించాలని ‘విరసం’ ఒక ప్రకటన లో కోరింది.