కశ్మీర్ సంక్షోభానికి సూరజ్‌కుండ్‌ లో బీజం. ఇక‘భావోద్వేగ యుద్ధం’.

ఎస్.కె.జకీర్.
కశ్మీర్ సంక్షోభం వెనుక ఆర్.ఎస్.ఎస్.ఉన్నట్టు అనుమానాలు కలుగుతున్నాయి. సూరజ్‌కుండ్‌లో ఈ నెల 14,15,16 తేదీలలో జరిగిన బిజెపి, ఆర్.ఎస్.ఎస్.లమే ధోమథన సమావేశాలలోనే దీనికి బీజం పడినట్టు తెలియవచ్చింది. మోడీ చివరి ఆయుధం కశ్మీరాస్త్రంఅనితేలిపోయింది. కశ్మీర్ లో సంక్షోభం కాకతాళీయం కాదు. హింస రచనకు భారీ వ్యూహంఇది. లోక్ సభ ఎన్నికలు అవసరమైతే ముందస్తు గా నిర్వహించడానికి కూడాఒక ప్రణాళిక. ఒకఎత్తుగడ. అందుకే యుద్ధం కన్నా భయంకరమైన ‘భావోద్వేగ యుద్ధ్హాని’కి మోడీ కార్యాచరణను ఖరారు చేశారు. హర్యానాలోని సూరజ్ కుండ్ లో బిజెపి,ఆర్ ఎస్ ఎస్ ల సమావేశాలు ముగిసిన మూడు రోజుల్లోనే కశ్మీర్పరిణామాలు చోటు చేసుకోవడం రాజకీయప్రాదాన్యతనుసంతరించుకున్నాయి. జూన్14,15,16 తేదీలలో ఈ కీలకమైన సమావేశాలు జరిగాయి. జూన్ 15న తన నివాసంలో ఆర్.ఎస్.ఎస్.ముఖ్య నాయకులకు ప్రధానమంత్రి మోడీ విందు ఇచ్చారు. ఈ విందులో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, సంఘ్‌ కార్యనిర్వాహక అధినేత సురేశ్‌ భయ్యాజీ జోషీ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 60 మంది బీజేపీ, ఆరెస్సెస్‌ ముఖ్యులుహరియాణాలోనిసూరజ్‌కుండ్‌ సమావేశాలకు హాజరయ్యారు. నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా చేసిన అభివృద్ధి పనులు, భవిష్యత్తు కార్యాచరణ, వివిధ కాషాయ సంస్థల్లో మరింత సమన్వయంపై సూరజ్‌కుండ్‌లోమేధోమథన సమావేశాలు జరిగాయి.
ఆర్.ఎస్.ఎస్.ప్రముఖులతో ప్రతి యేటా బిజెపి అగ్రనాయకత్వం సమావేశం కావడం సాధారణ విషయమే. ఇలాంటి సమన్వయసమావేశాల ద్వారా ప్రజల మనోభావాలు, సంస్థాగతంగా పార్టీ బలహీనతలు, అర.ఎస్.ఎస్.ఫీడ్ బ్యాక్ తెలుసుకోవడానికిపనికొస్తాయని బిజెపి వర్గాలంటున్నాయి. రాజస్థాన్, చత్తీస్గడ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో అనుసరించవలసిన వ్యూహాలపై సూరజ్ కుండ్ సమావేశాల్లో ప్రధానంగా చర్చించినట్టు వార్తలువెలువడ్డాయి. కానీకశ్మీర్అంశంపై చర్చ జరిగినట్టు గానీ, దానిపై ఒక కీలక నిర్ణయం వెలువడబోతుందని గానీ ఎక్కడా పోక్కనివ్వలేదు. కశ్మీర్లోరాజకీయ సంక్షోభానికి‘సూరజ్కుండ్’ సమావేశాల్లోనే బీజం పడినట్టు తెలుస్తోంది. జమ్మూ-కశ్మీరులో రంజాన్ సందర్భంగా అమలు చేసిన కాల్పుల విరమణను పొడిగించరాదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జూన్ 17న ప్రకటించింది. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భద్రతా దళాల కార్యకలాపాలు మళ్ళీ ప్రారంభమవుతాయని పేర్కొంది. భద్రతా దళాల కార్యకలాపాలను నిలిపివేయడం వల్ల రాష్ట్ర ప్రజల్లో నమ్మకం పెంచవచ్చునని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారి వెల్లడించారు. ‘ఉగ్రవాదులు, హురియత్ వంటి వేర్పాటువాదులు అందుకు అనుగుణంగా స్పందించలేదు. ఉగ్రవాదులు, పాక్ సైనికులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి పాత్రికేయులు, సైనికులు, సామాన్య ప్రజలను హత్య చేస్తున్నారు. దీంతో కాల్పుల విరమణను పొడిగించరాదని ప్రభుత్వం నిర్ణయించింది’. అనిహోమంత్రిత్వశాఖ వివరించింది. కాశ్మీర్ లో సంకీర్ణ పీడీపీ, బ్జేపి ప్రభుత్వానికి బిజెపి జూన్ 19 న తన మద్దతు ఉపసంహరించుకున్నది. కాశ్మీర్ లో రాజకీయ సంక్షోభానికి తెరతీసింది. కశ్మీర్ లో రాష్ట్రపతి పాలన ఏర్పాటు చేసి అక్కడ దారుణమైన, భయానక పరిస్థితులు సృష్టించి ‘కశ్మీర్ మన చేజారిపోతుంది’ అనే అనవసర భయాన్ని కలుగజేయనున్నారు. ఆకశ్మీర్ ని కాపాడగలిగే మొనగాడు మోడీ మాత్రమే అనే భ్రమల్ని ప్రచారం జరగబోతున్నది. మళ్లీ100 కోట్ల మంది భారత జనాభాను ఏప్రిల్ ఫూల్ చేయవచ్చును. మళ్లీ అధికారంలోకి రావడం కోసం మోడీ ఆడబోతున్న అత్యద్భుతమైన నాటకానికి తొలి అంకం ప్రారంభమైనట్లే. గడచిననాలుగేళ్ళలో వైఫల్యాల వల్ల కేంద్ర ప్రభుత్వం ప్రజాదరణ కోల్పోయింది. ప్రధాని మోడీ గ్రాఫ్ అమాంతం దిగజారుతూ వస్తున్నది.
మోడీ దగ్గర మిగిలి ఉన్న చిట్ట చివరి అస్త్రం ‘కశ్మీర్’ మాత్రమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధం చేయటం చాలా కష్టం. అందుకే యుద్ధం కంటే భయంకరమైన భావోద్వేగ యుద్ధం సృష్టించి,భారతీయులు తమ సమస్యలన్నీ మర్చిపోయి, నోట్లరద్దు కష్టాల్ని, బీజేపీ చేసిన అరాచకాలు అన్నీ మర్చిపోయి కేవలం కశ్మీర్ గురించి మాత్రమే ఆలోచించేలా చేయటం కోసం ‘దేశభక్తి పాచిక’ను మరోసారి సంధిస్తున్నారు. ఎలాగైనా సరే మళ్లీ కేంద్రంలో అధికారంలోకి రావడానికి విసరనున్నబ్రహ్మాస్త్రం ‘కశ్మీర్’.ఇకనుంచికశ్మీర్ లో జరిగే పరిణామాలు చాలా ఆసక్తి కరంగా ఉందవచ్చును. ఒక మంచి సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్ లాగా ఉండవచ్చును. ‘సర్జికల్ స్ట్రైక్స్’ అనే అబద్ధం తో భారతీయులను ఎలా భ్రమలకు గురి చేశారో ఇప్పుడు కశ్మీర్ పాచికతో కూడా అదే చేయబోతున్నారు.“ కశ్మీర్లోయలో ప్రతిరోజూ కాల్పులే. అమాయకులుబలైపోతున్నారు. పౌరుల ప్రాథమిక హక్కులు హరించుకుపోతున్నాయి. ఇక ఈ ప్రభుత్వంలో కొనసాగలేం. ఈ స్నేహం నిలవదు. ఇంకా కొనసాగడం ఎంతమాత్రం ఆమోదయోగ్యంకాదు. భద్రమూ కాదు. 2015 లో మేము పొత్తు పెట్టుకున్నప్పుడు మేం ఆశించిన లక్ష్యాలు రెండు. శాంతి స్థాపన. రాష్ట్రాన్నిఅభివృద్ధిపథంలోనడపడం. మూడేళ్ళ తర్వాత సమీక్షించుకున్నాం. ఆశించినవిజరగలేదు. రాష్ట్రంలో ఉగ్రవాదం మరింత పెచ్చరిల్లింది. పత్రికాస్వేచ్ఛ ప్రమాదంలో పడింది. దేశ దీర్ఘకాల భద్రత, రక్షణప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం.’’అనిభారతీయ జనతాపార్టీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్సమర్ధించుకున్నారు.
“ కశ్మీర్శత్రు స్థావరం కాదు. 30 ఏళ్ల తర్వాత కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. దాన్తోనైనాకశ్మీర్ కు న్యాయం జరుగుతుందని భావించాం. అందుకేబిజేపి తో పెట్టుకున్నాం తప్ప అధికారం కోసం కాదు”.అని పిడిపి అధ్యక్షురాలు,మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించారు.
కశ్మీర్ప్రభుత్వంలో బిజెపి భాగస్వామిగా ఉన్నప్పటికీ అక్కడ శాంతిభద్రతలుపూర్తిగాక్షీణించడం,ఉగ్రవాదం అణచివేతలో వైఫల్యం దేశవ్యాప్తంగా తమ పార్టీ ప్రతిష్టకు మచ్చ తెచ్చినట్టు బిజెపి భావించింది.దిగజారిన పార్టీ ప్రతిష్టను పునరుద్ధరించేందుకు,పార్టీ శ్రేణుల్లో పట్టు నిలుపుకునేందుకు ప్రభుత్వం నుంచి తప్పుకోవాలన్న ఎత్తుగడ వేసినట్టు జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర ప్రొఫెసర్ మనీంద్రనాథ్ఠాకూర్ అన్నారు.కశ్మీర్రాజకీయ సంక్షోభాన్ని ‘లోక్ సభ ఎన్నికల కోసమేనా?’ అనే శీర్షికతో తెలంగాణ రాష్ట్ర సమితి కి చెందిన పత్రిక కూడా వార్తా కధనాన్ని ప్రచురించింది.
2014 లో కేంద్రంలో బిజెపి పార్టీ, నరేంద్రమోడీ నాయకత్వంలో పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. కాని అసలు పెత్తనం ఆర్ ఎస్ ఎస్దే. “సంఘ్ అధికారం సంపాదించేందుకు ప్రయత్నిస్తున్న మాట వాస్తవమేనా”? అని ఆర్ ఎస్ ఎస్ నాయకుడు గోల్వాల్కర్ ను ఒక విలేఖరి ఒక ప్రశ్న వేశారు. “భగవాన్ శ్రీ కృష్ణుడిని మేం ఆదర్శంగా ఎంచుకున్నాం. తన చూపుడు వేలుతో పెద్ద సామ్రాజ్యాన్ని శాసిస్తూనే, చక్రవర్తి పదవిని శ్రీ కృష్ణుడు స్వయంగా తిరస్కరించాడు”అని గోల్వాల్కర్ అన్నారు. దీన్ని బట్టి ఆర్.ఎస్.ఎస్ కేంద్రప్రభుత్వాన్ని, బిజెపి నిర్ణయాలను ఏ స్థాయిలో ప్రభావితం చేయగలదోఊహించవచ్చును.