కార్యకర్త కుటుంబానికి కవిత ఓదార్పు!!

కార్యకర్త కుటుంబానికి కవిత ఓదార్పు!!

Nijamabad:

తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తానని మాజీ ఎంపీ కవిత స్పష్టం చేశారు. బంగారు తెలంగాణ కోసం కలిసి పనిచేద్దామని, ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని అన్నారు. నిజామాబాద్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఇటీవల మృతి చెందిన టీఆర్‌ఎస్ కార్యకర్త కిశోర్ కుటుంబాన్ని కవిత ఇవాళ పరామర్శించారు. కిశోర్ మరణం టీఆర్‌ఎస్ పార్టీకి తీరని లోటన్నారు. కిషోర్ కుటుంబానికి అండగా ఉంటామని కవిత స్పష్టం చేశారు.