కాళేశ్వరంలో రెండోరోజూ హరీశ్ సుడిగాలి పర్యవేక్షణ.

కరీంనగర్:
రెండో రోజు కూడా మంత్రి హరీష్ రావు కాళేశ్వరం పనులను పర్యవేక్షించారు. ప్యాకేజీ 6 లో సర్జు పూల్ పనుల పరిశీలించారు. ఆగస్టు 15 కల్లా నీటిని నింపడానికి సర్జ్ పూల్ నీ సిద్దం చేయాలని మంత్రి ఆదేశించారు. సర్జ్ పూల్ లో 90 శాతం పనులు పూర్తి అయ్యాయని, డ్రాఫ్ట్ ట్యూబ్ గేట్ల బిగింపు పనులు కొనసాగుతున్నాయని నవయుగ ప్రతినిధి వెంకట రామారావు మంత్రి కి వివరించారు. ఆగస్టులో సర్జ్ పూల్ పనులు వంద శాతం పూర్తి అవుతాయని అన్నారు. ప్య్యాకేజి 6 టన్నెల్ లైనింగ్ పనులు మొత్తం పూర్తి చేశామని, క్రాస్ కట్స్ మూసివేసే పనులు జరుగుతున్నాయని, గ్రౌటింగ్ , క్లీనింగ్ పనులు జరుగుతున్నాయని ఆయన మంత్రికి వివరించారు. ఈ పనులన్నీ ఆగస్టు నెలాఖరుకు పూర్తి అవుతాయని మంత్రికి వివరించారు.
ప్యాకేజీ 6 పంప్ హౌజ్ లో యూనిట్ 1 పనులు పూర్తి అయినాయి. ఈ నెలాఖరుకు డ్రై రన్ చేస్తామని ఇంజనీర్లు చెప్పారు. అందుకు భూగర్భంలో నిర్మాణం అవుతున్న 400 కే వి GIS సిద్దం కావాలని అన్నారు. రెండో యూనిట్ బిగింపు పనులు ఈ నేఖరుకు పూర్తి చేస్తామని అన్నారు. ఆగస్టు 15 నాటికి మూడో యూనిట్ కూడా సిద్దం అవుతుందని ఇంజనీర్లు మంత్రికి వివరించారు. ఆగస్టు 15 నాటికి రెండు యూనిట్లు వెట్ రన్ కి సిద్దం చేయాలని మంత్రి ఆదేశించారు. పంప్ హౌజ్ లో పూర్తి చేయాల్సిన పనుల లిస్ట్ తయారు చేసుకొని వాటిని నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని సూచించారు.
ఎల్లంపల్లి బ్యారేజినీ మంత్రి హరీష్ రావు శుక్రవారం సందర్శించారు. బ్యారేజి కి వస్తున్న వరద పరిస్థితి, గేట్ల పని తీరును తెలుసుకున్నారు. డ్యాం వద్దకు చేర్కునే అప్రోచ్ రోడ్డు దుస్తితిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యారేజి ఎడమ వైపున రోడ్డు పనులు జరుగుతున్నాయని, త్వరలోనే కుడి వైపున కూడా ప్రారంభిస్తామని ఇంజనీర్లు చెప్పారు. వరద బాగా వస్తున్నందున 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఇంజనీర్లకు సూచించారు.